చట్టంలో లొసుగులు.. నిర్భయ దోషుల ఉరిలో మరో ట్విస్ట్

అనేక మలుపులు తిరుగుతున్న నిర్భయ దోషులకు ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాల వరకు వారిని ఉరితీయకూడదని తీహార్ జైలు అధికారులను జారీ చేసింది. 2012 ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం యావత్ భారతదేశాన్ని కదిలించి వేసింది. డిసెంబర్ 16, 2012 న భారత రాజధాని ఢిల్లీలో ఒక వైద్యవిద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి […]

Written By: Neelambaram, Updated On : March 2, 2020 6:52 pm
Follow us on


అనేక మలుపులు తిరుగుతున్న నిర్భయ దోషులకు ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాల వరకు వారిని ఉరితీయకూడదని తీహార్ జైలు అధికారులను జారీ చేసింది.

2012 ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం యావత్ భారతదేశాన్ని కదిలించి వేసింది. డిసెంబర్ 16, 2012 న భారత రాజధాని ఢిల్లీలో ఒక వైద్యవిద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి అత్యాచారం చేశారు. ఆ సంఘటనలో తల మరియు పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 29 డిసెంబర్ 2012 న ఆమె తుదిశ్వాస విడిచారు.

ఈ కేసులోని ఆరుగురు దోషుల్లో ఒకడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి… మైనర్ కావడంతో… మూడేళ్ల శిక్ష తర్వాత 2015లో విడుదలయ్యాడు. మిగతా నలుగురు ముకేష్ కుమార్ సింగ్ (32), పవన్ కుమార్ గుప్తా (25), వినయ్ కుమార్ శర్మ (26), అక్షయ్ సింగ్ (31)కి ఉరిశిక్ష పడింది. ఐతే చట్టంలో లొసుగులును ఉపయోగించుకొని.. ఉరిశిక్షను వాయిదాపడేలా చేస్తున్నారు దోషులు.