Amma Vodi Scheme: ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి పథకంలో ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇవ్వాల్సిన డబ్బులు జూన్ కు వాయిదా వేయగా తాజాగా హాజరు శాతం నిబంధన తెరమీదకు రావడంతో గుబులు రేగుతోంది. అసలు డబ్బులు వస్తాయో రావో అనే బెంగ పట్టుకుంది. ప్రతి సంవత్సరం విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో ప్రభుత్వం అమ్మఒడి పథకం పేరిట రూ, 15 వేలు వేస్తోంది.
కానీ ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో వేయలేదు. పైగా విద్యార్థుల హాజరు శాతం 75 శాతం ఉన్న వారికే డబ్బులు వేస్తామని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయానికి గురవుతున్నారు. తమకు డబ్బులు వస్తాయో రావో అనే టెన్షన్ పట్టుకుంది. ప్రభుత్వం ఇలా మధ్యలో చెప్పడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రభుత్వం తప్పించుకోవడానికే ఇలా చేస్తుందనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.
ప్రభుత్వం కోతలు విధించేందుకే ఇలా పథకాన్ని పక్కదారి పట్టిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల పేరుతో విద్యార్థులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం హాజరు నిబంధన తెచ్చిందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రులు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Jagan vs Raghurama: అనవసరంగా పెట్టుకొని జగన్ అభాసుపాలయ్యారా?
అయితే విద్యాసంవత్సరం ప్రారంభంలో చెబితే విద్యార్థులు బడికి సరిగా వెళ్లేవారు. ఇలా మధ్యలో చెప్పడంతో ఇప్పుడు హాజరు శాతం లేనివారు ఏం చేయలేని పరిస్థితి. పైగా ఈ విద్యాసంవత్సరంలో 75 శాతం హాజరు శాతం ఉంటేనే జూన్ లో అమ్మఒడి పథకానికి అర్హులవుతారనే నిబంధనతో తల్లిదండ్రులు హైరానా పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Also Read: NTR Vennupotu Balakrishna: ఎన్టీఆర్ కు వెన్నుపోటు: బాలయ్య కన్నీళ్లకు అర్థం ఉందా?