Sara Tendulkar: భారత క్రికెట్ స్టార్ సచిన్ తెందూల్కర్ ముద్దుల కూతురు సారా తెందూల్కర్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పచియం చేయనక్కర్లేదు.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సచిన తన ఆటతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకోగా.. సారా తన అందంతో.. ఎంతో మందిని తన ఫ్యాన్స్‌గా మార్చుకుంది. మరోవైపు ఫ్యాషన్ డిజైనింగ్‌పైనా పట్టున్న ఈ స్టార్ కిడ్.. సామాజిక మాధ్యమాల్లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ.. ఫొటోలు, వీడియోలను నెటిజన్లతో షేర్ చేస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె పెట్టో పోస్ట్‌లకూ అంతే రేంజ్లో రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ.

ఈ మేరకు ఓ బ్రాండెడ్ డ్రస్ కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. తాజాగా, ఇందుకు సంబంధించిన ఓ ప్రమోషనల్ వీడియో కూడా విడుదలైంది. ఇందులో సారాతో పాటు, ఆదిత్య వర్మ, సర్దార్ ఉద్దమ్ సింగ్ చిత్రాల్లో నటించిన బనితా సింధూ, అహన్ షెట్టి ప్రియురాలు తానియా ష్రాఫ్ కూడా సందడి చేశారు.
Also Read: ఫుల్ స్పీడ్ లో విక్రమ్ – వేద హిందీ రీమేక్ షూటింగ్…
కాగా, సారా ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ అంతర్జాతీయ స్కూల్లో తన చదువు పూర్తిచేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌కు వెళ్లి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో మెడిసిన్ చదివింది. ఇక ఫ్యాషన్ డిజైనింగ్‌పై ఆసక్తి పెంచుకున్న సారా సినిమా రంగంలోకి అడుగుపెడుతుందని గతంలో అనేక వార్తలు వినిపించాయి. మరోవైపు సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ భామ.. టీమ్ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్‌తో ఉందన్న వార్తలూ వినిపించాయి. అందుకు తగ్గట్లే.. గిల్ షేర్ చేసే పోస్టులకు ఈ ముద్దుగుమ్మ స్పందించడం.. గిల్ సరదాగా రిప్లై ఇవ్వడం.. ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే, తమ బంధంపై ఎప్పుుడూ వీరు బహిరంగంగా చెప్పుకోలేదు.
Also Read: బాలీవుడ్ లో ట్యాలెంట్ కన్నా ఇంటి పేరు ముఖ్యం అంటున్న… వివేక్ ఒబెరాయ్