RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ స్టార్ హీరోల అయినా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ అలానే హాలీవుడ్ యాక్టర్ ఓలివియా మోరీస్, శ్రీయ శరణ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం.

ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్,టీజర్, పాటలు ప్రేక్షక అభిమానులలో ఈ మూవీ పై ఇంకాస్త భారీ అంచనాలు పెంచాయి. కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబరు 9న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్రబృందం. కాగా, ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనుండగా.. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో అలరించనున్నారు. ఈ క్రమంలోనే ట్రైలర్ విడుదలకు ముందు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కొత్త లుక్స్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి.

Also Read: ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు.. ఆకట్టుకుంటున్న న్యూ పోస్ట్
ఈ క్రమంలోనే ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న వాళ్లున్నారు. వారిలో ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఒకరు. కాగా, ఈ పోస్టర్లపై పూజా స్పందించింది. రామ్‌చరణ్, తారక్ ఇద్దరూ ఇందులో అదరగొడుతున్నారంటూ.. ట్వీట్ చేసింది. వీరిద్దరిని స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. కాగా, ప్రస్తుతం పూజా ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్‌లో నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
Also Read: ఊహకందని రేంజ్లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్.. గ్రాండ్‌గా ట్రైలర్ రిలీజ్‌కు ఏర్పాట్లు