Homeజాతీయ వార్తలుRTO Rules: 15 ఏండ్లు నిండిన వాహనాల గురించి ప్రభుత్వం ఏమంటుందంటే..?

RTO Rules: 15 ఏండ్లు నిండిన వాహనాల గురించి ప్రభుత్వం ఏమంటుందంటే..?

RTO Rules: వస్తువుకైనా.., వాహనానికైనా.., చివరికి మనిషికైనా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది కదా.. సరే మనిషిని పక్కన పెడితే వాహనాల ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడో ఎందుకో తెలుసా.. ఆ తర్వాత కూడా వాడితే ఏమవుతుందో తెలిస్తే వెంటనే వాటిని విడిచిపెడతారు. అయితే గతంలో అయితే అలానే జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు. వీటిని తిరిగి ఇచ్చి మరో బైక్ పై రాయితీలను పొందవచ్చు. కాలం చెల్లిన వాహనాలపై ఆర్టీఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. షోరూం నుంచి బయటకు వచ్చిన తర్వాత 15 ఏండ్లు పూర్తయిన వాహనాలను కాలం చెల్లిన వాహనాలుగా పరిగణిస్తారు. వీటిని స్వచ్ఛందంగా స్క్రాపింగ్‌ చేసుకుంటే రాయితీలు వస్తాయి. ఈ విషయంపై ఇటీవల అధికారులు ఆర్టీఏ కార్యాలయాలతో పాటు ప్రధాన కూడళ్లలో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. కాలం చెల్లిన వాహనాలపై ఆర్టీఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. 15 ఏండ్లు నిండిన వాటిని స్వచ్ఛందంగా స్క్రాపింగ్‌ చేసుకుంటే రాయితీలు పొందచ్చనని ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహా నగరంలో ఎక్స్ పైరీ వెహికిల్స్ వేలాదిగా ఉన్నాయని గణాంకాలు చెప్తున్నారు. ఇవన్నీ రోడ్లపై చక్కర్లు కొడుతూ పొల్యూషన్ పెంచుతున్నాయి.

కాలం చెల్లిన వాహనాలు రోడ్లపైకి రావడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటితో ముఖ్యంగా పర్యావరణం కలుషితం అవుతుంది. కాలుష్యం పెరుగుతుంది. 15 ఏళ్ల వాహనం అంటే ఇంజిన్ మొత్తం మరమ్మతుకు గురవుతుంది. ఈ విధంగా ఇంజిన్ నుంచి పొగలు వచ్చి వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఇక అధిక శబ్ధం చేస్తుంది కాబట్టి శబ్ధ కాలుష్యం కూడా ఉంటుంది. ఆ తర్వాత బ్రేకులు పరిగా పడక తోటి వాహదారులు, బాటసారులను కూడా ఢీ కొనే ప్రమాదం ఉంటుుంది. కాబట్టి కాలం చెల్లిన వాహనాన్ని స్క్రాప్ కు పంపించాలని అధికారులు ఆదేశిస్తూనే ఉన్నారు.

కాలం చెల్లిన వాహనాల విషయంలో అధికారులు తనిఖీల్లో కొన్ని పట్టుబడుతున్నాయి. ఇందులో చాలా వరకు స్కూల్‌ బస్ లు, కార్లు, బైకులు ఉంటుంటున్నాయి. గడువు ముగిసినా ఇంకా ఇవి రోడ్లపై కనిపిస్తూనే ఉన్నాయి. అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీలు నిర్వహిస్తూ పట్టుకుంటూ ఫైన్లు వేస్తున్నారు. స్క్రాపింగ్‌ ఉపయోగాలను కూడా వివరిస్తున్నారు. ట్రాన్స్‌ పోర్ట్‌ కు సంబంధించిన వాహనాలు 20 ఏండ్ల లోపు స్క్రాప్‌ చేస్తే.. ఏటా పన్నుపై 10 శాతం రాయితీ కలుగుతుంది. సొంత వాహనం 15 ఏండ్ల తర్వాత స్వచ్ఛందంగా స్క్రాప్ కు వస్తే సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్‌ వర్తిస్తుంది. దీనిలో భాగంగా రెండేళ్లలోపు అదే విలువ గల వాహనం కొంటే మోటార్ వెహికిల్ (ఎంవీ) ట్యాక్స్‌లో మినహాయింపు వస్తుంది. ఈ అంశాలపై వాహనదారులకు విరివిగా అవగాహన కల్పిస్తున్నారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version