https://oktelugu.com/

coriander : ఫ్రిడ్జ్ లో ఈ మొక్కను పెంచుకోవచ్చట.. వివరాలు తెలిస్తే షాక్ అవుతారు..

కొత్తమీరకు ఎక్కువ సమయం నీరు తగలకుంటే వాడిపోతుంది. దీంతో ఆకులు నల్లబారి ఎండిపోతాయి. ఇలా జరగకుండా ఉండేందుకు కొత్తమీర కట్టును కొనడం తోనే ఒక గిన్నెలో వేసి చెంచా వెనిగర్ పోయాలి. ఆ తర్వాత వెనిగర్, నీటితో కొత్తిమీరను శుభ్రంగా కడగాలి. తర్వాత గ్లాసులో సగం నీరు తీసుకొని ఈ కొత్తిమీర ఆకుల వేర్లను అందులో ఉంచాలి. తర్వాత ఆకు పైభాగాన్ని ప్లాస్టిక్ కవర్ తో కప్పి ఫ్రిజ్ డోర్ పక్కన ఉంచుకోవాలి.

Written By: , Updated On : December 13, 2024 / 07:02 AM IST
coriander

coriander

Follow us on

coriander : కూరగాయలు, పండ్లు, తిను బండారాలు తాజాగా ఉండాలంటే ఫ్రిడ్జ్ లో పెడతారు. ఇది సర్వ సాధారణంగా అన్ని ఇళ్లలో చేసే పనే. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఆకులు కూరలు, ఇతర ఆహార పదార్థాల్లో వాసన, రుచి కోసం వాడుతుంటారు. కానీ వీటి ద్వారా ఆరోగ్య పరమైన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని షాపుల నుంచి కొనుగోలు చేసి ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంచుకునేందుకు చాలా చిట్కాలు ఉన్నాయి. అందులో ఒకటి. కొత్తమీరకు ఎక్కువ సమయం నీరు తగలకుంటే వాడిపోతుంది. దీంతో ఆకులు నల్లబారి ఎండిపోతాయి. ఇలా జరగకుండా ఉండేందుకు కొత్తమీర కట్టును కొనడం తోనే ఒక గిన్నెలో వేసి చెంచా వెనిగర్ పోయాలి. ఆ తర్వాత వెనిగర్, నీటితో కొత్తిమీరను శుభ్రంగా కడగాలి. తర్వాత గ్లాసులో సగం నీరు తీసుకొని ఈ కొత్తిమీర ఆకుల వేర్లను అందులో ఉంచాలి. తర్వాత ఆకు పైభాగాన్ని ప్లాస్టిక్ కవర్ తో కప్పి ఫ్రిజ్ డోర్ పక్కన ఉంచుకోవాలి. ఇలా చేస్తే కొత్తిమీర ఆకులను నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది. మీరు తగినంత కొత్తిమీర ఆకులను తెంపుకుంటూ వాడుకోవచ్చు. ఆకును తీసుకున్న ప్రాంతం నుండి కొత్త రెమ్మలు పెరగడం కూడా జరుగుతుంది. ఫ్రిజ్ లో పెట్టినా కొత్తిమీరను పెంచుకోవచ్చు. ఫ్రెష్ గా కూడా ఉంటుంది.

కొత్తిమీరతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి
సమృద్ధిగా పోషకాలు: కొత్తిమీరలో విటమిన్ సీ, విటమిన్ కే, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పీచు రుచులైన ఫైబర్ పోషకాలున్నాయి.
పేగుల ఆరోగ్యం మెరుగుపరుస్తుంది: కొత్తిమీరలో ఉండే ఫైబర్ పేగుల కంట్రోల్‌ని మెరుగు పరిచేందుకు సాయం చేస్తుంది. ఇది జీర్ణ సమస్యలు, మలబద్దకం, గ్యాస్ సమస్యలకు తగ్గిస్తుంది.
రక్తపు చక్కర నియంత్రణ: కొత్తిమీర అనేక రీసెర్చులు దీని రక్తపు చక్కర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సహాయపడే శక్తిని కలిగి ఉంటాయని సూచిస్తున్నాయి.
గుండె ఆరోగ్యం: కొత్తిమీర హృదయానికి మేలు చేస్తుంది. ఇది రక్తపోటు తగ్గించేందుకు, కాలుష్యంతో పోరాడేందుకు, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సాయపడుతుంది.
తాజా శక్తి ఇవ్వడం: కొత్తిమీర ఆకులు, ఇతర ఔషధాలు, పానీయాల ద్వారా శరీరానికి శక్తిని అందిస్తాయి.
బ్యాక్టీరియల్ ప్రొటెక్షన్: కొత్తిమీరలో ఉన్న యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరంలో వ్యాధి కారకాలను పసిగట్టడంలో సాయ పడుతాయి.