CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. కొత్త జిల్లాలు, కొత్త రాజధాని, కొత్త పాలనకు ఉగాదిని వేదికగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తనను కలిసిన సినిమా వాళ్లతో కూడా మనం విశాఖ వెళ్లాలి అంటూ సూచన చేయడం గమనార్హం. దీంతో సీఎం మదిలో విశాఖ రాజధాని అనే విషయం ఎప్పటి నుంచో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పరిపాలన విశాఖ నుంచే కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
విశాఖలోనే క్యాంపు కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఉగాది నుంచి పాలన సాగించాలని చూస్తున్నట్లు భావిస్తున్నారు. దీని కోసమే అన్ని కసరత్తులు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. జగన్ మదిలో ఏముంటే అది చేయడానికే ముందుకు వస్తారని తెలిసిందే. అందుకే విశాఖను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: అప్పటి నుంచి తెరుచుకోనున్న ఐటీ కంపెనీలు.. రెడీ అంటున్న ఉద్యోగులు..!
ఇప్పటికే రాజధాని తరలింపుపై ఆలోచించిన జగన్ ఇప్పుడు మాత్రం ఉగాదినే ఎంచుకున్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో కొత్త జిల్లాల ఏర్పాటు కూడా అప్పటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం అధికారులను కూడా సమాయత్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రివర్గం పునర్వ్యవస్థీకరిస్తారని ఊహాగానాలు వస్తున్నందున ఉగాదికి అందరికి తీపి కబురు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా మంత్రివర్గ విస్తరణ చేపడతారని వార్తలు వస్తున్నా జగన్ మాత్రం ధైర్యం చేయడం లేదు. దీంతో ఆశావహులు మాత్రం మంత్రి పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జగన్ ప్రమాణ స్వీకారం రోజే రెండున్నరేళ్ల తరువాత మంత్రి వర్గం మారుస్తామని చెప్పినందున అప్పుడు చూసుకుందామని భావించిన వారికి ప్రస్తుతం కల నెరవేరుతుందని ఎదురుచూస్తున్నారు.
దీంతో ఉగాది నుంచి కొత్త పాలన, కొత్త మంత్రి వర్గం, కొత్త జిల్లాలు అన్ని కొత్తగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో జగన్ కొత్త చరిత్రకు శ్రీకారం చుడతారని చూస్తున్నారు. ఇందుకోసమే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అన్ని కుదిరితే ఉగాదినుంచి ఇవన్నీ సాధ్యమవుతాయని ఆశిస్తున్నారు.
Also Read: పానీపూరీ నీళ్లు అతిగా తాగేస్తున్నారా.. ఎంత డేంజరో తెలుసుకోండి..!