https://oktelugu.com/

Mahesh: మహేష్ ‘కళావతి’ పైరసీకి గురి అయ్యింది !

Mahesh:  సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ కళావతి అంటూ సాగే పాట ఈ నెల 14న రిలీజ్ కావాల్సి ఉంది. నిన్నే ఈ పాట ప్రొమో విడుదల కాగా.. ఎల్లుండి రిలీజ్ కావాల్సిన పాట ఈ రోజే సోషల్ మీడియాలో లీకైంది. సోషల్ మీడియాలో మొత్తం పాట వైరల్ కావడంతో.. సైబర్ క్రైమ్ పోలీసులకు SVP […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 13, 2022 / 01:21 PM IST
    Follow us on

    Mahesh:  సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ కళావతి అంటూ సాగే పాట ఈ నెల 14న రిలీజ్ కావాల్సి ఉంది. నిన్నే ఈ పాట ప్రొమో విడుదల కాగా.. ఎల్లుండి రిలీజ్ కావాల్సిన పాట ఈ రోజే సోషల్ మీడియాలో లీకైంది. సోషల్ మీడియాలో మొత్తం పాట వైరల్ కావడంతో.. సైబర్ క్రైమ్ పోలీసులకు SVP యూనిట్ ఫిర్యాదు చేసింది.

    Mahesh

    మొత్తానికి మహేష్ సినిమాకు పైరసీ బెడద గట్టిగానే తగిలింది. నిజానికి ఈ సినిమా అప్‌ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఇలా కాపీకి గురి కావడం చిత్రబృందానికి షాకింగ్ విషయమే. చంద్రబోస్ రాసిన ఈ లవ్ సాంగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా వచ్చిన ఈ ఫస్ట్ సింగిల్‌ ను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇటీవల క్లారిటీ ఇచ్చాక.. ఇలా లీక్ కావడంతో టీం బాగా నిరుత్సాహానికి గురి అయ్యింది.

    Also Read: పానీపూరీ నీళ్లు అతిగా తాగేస్తున్నారా.. ఎంత డేంజ‌రో తెలుసుకోండి..!

    అసలు ఈ మూవీ నుంచి మాస్ పాట వస్తుందని తొలుత అంతా భావించగా.. ప్రేమికుల దినోత్సవం రోజున మొత్తమ్మీద లవ్ సాంగ్ ను వదిలాలని నిర్ణయించుకున్నాక, ఇక త్వరలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను ‘గోవా’లో ప్లాన్ చేస్తారట. ముందుగా ఒక సాంగ్ ను షూట్ స్టార్ట్ చేస్తారట. కాగా ఈ సాంగ్ షూట్ లో మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా పాల్గొననున్నారు.

    Mahesh

    మొత్తానికి ‘సర్కారు వారి పాట’ భారీ కమర్షియల్ హిట్ అయ్యేలా ఉందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

    Also Read:  నువ్వేంటి త‌ల్లి ఇలా ఉన్నావ్‌.. ఆర్టీసీ డ్రైవ‌ర్‌ను ఇలా కొడ‌తావా..!

    Tags