https://oktelugu.com/

తెలంగాణలో నూతన శకం ఆరంభం

తెలంగాణలో నూతన శకం ఆరంభమైంది. అవినీతికి ఆస్కారం లేని విధంగా కొత్త పాలన మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం సభ్యుల సలహాలు, సూచనల అనంతరం కేసీఆర్ దీనిపై సమాధానమిచ్చారు. సుధీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్ అవినీతి లేని తెలంగాణకు ఇది ఆరంభం అని.. అంతం కాదంటూ పేర్కొన్నారు. Also Read: కేసీఆర్ సర్కార్ కు సుప్రీం కోర్టు షాక్ అనంతరం స్పీకర్ పోచారం తెలంగాణ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2020 / 07:33 PM IST
    Follow us on

    తెలంగాణలో నూతన శకం ఆరంభమైంది. అవినీతికి ఆస్కారం లేని విధంగా కొత్త పాలన మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం సభ్యుల సలహాలు, సూచనల అనంతరం కేసీఆర్ దీనిపై సమాధానమిచ్చారు. సుధీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్ అవినీతి లేని తెలంగాణకు ఇది ఆరంభం అని.. అంతం కాదంటూ పేర్కొన్నారు.

    Also Read: కేసీఆర్ సర్కార్ కు సుప్రీం కోర్టు షాక్

    అనంతరం స్పీకర్ పోచారం తెలంగాణ కొత్త రెవెన్యూ బిల్లు లను ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లు ఆమోదం పొందింది..

    *భూముల సమస్యకు పరిష్కారం చూపిన కేసీఆర్

    తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా.. దానికో లెక్కుంటుంది.. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఒకేరోజులో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ సమగ్ర సర్వే చేయించి ఔరా అనిపించుకున్నారు. ఈ సర్వే వల్ల ప్రజలకు ప్రయోజనాలు అందాయా? లేదా అన్నది పక్కన పెడితే ఆ సర్వేతో యావత్ దేశం తెలంగాణ వైపు చూసేలా చేశారు.

    ఇక మరోమారు అలాంటి సర్వేనే తెలంగాణలో చేపట్టేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి తెలంగాణలోని ప్రతీ ఇంచు భూమిని సర్వే చేసి తెలంగాణలో భూసమస్యలు లేకుండా చేయాలని కేసీఆర్ సంకల్పించారు. ఇందులో భాగంగానే కొత్త రెవిన్యూ యాక్ట్ ను తీసుకొస్తున్నారు. దీనిలో భాగంగానే సమగ్ర భూసర్వేను త్వరలో చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

    నేడు అసెంబ్లీ సీఎం కేసీఆర్ కొత్త రెవిన్యూ యాక్ట్ పై సభ్యులకు ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 87 రెవిన్యూ చట్టాలు ఉన్నాయని తెలిపారు. కొత్త రెవిన్యూ యాక్ట్ భూసంస్కరణలో తొలి అడుగు అని చెప్పారు. ఎంతోమంది సలహాలు, సూచనలు తీసుకొని ఈ యాక్ట్ ను తీసుకొస్తున్నామని చెప్పారు. దీని వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందనే ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు.

    Also Read: రెవెన్యూ రచ్చ.. అసెంబ్లీని కుదిపేసింది!

    వ్యవసాయ, వ్యవసాయేతర భూములు వివరాలన్నింటిని ‘ధరణి’ పోర్టల్లో ఎప్పటికప్పుడు పొందుపర్చనున్నట్లు తెలిపారు. ఎక్కడి నుంచైనా ప్రజలు ఇందులోని వివరాలను తెలుసుకోవచ్చన్నారు. ఇక సర్వేను చేపట్టేందుకు చాలా కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు. ఒక్కో జిల్లాను ఒక్కో సంస్థకు కేటాయిస్తే వీలైనంత త్వరగా సర్వే పూర్తవుతుందన్నారు.

    గతంలో తెలంగాణలో చేపట్టిన సర్వే శాస్త్రీయంగా జరుగలేదని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత భూసమగ్ర సర్వేలో అన్ని వివరాలు పకడ్బంధీగా పొందుపరుస్తున్నట్లు తెలిపారు. ఏదిఏమైనా సీఎం కేసీఆర్ కొత్త రెవిన్యూ యాక్ట్.. సమగ్ర భూసర్వే వంటి సంచలన నిర్ణయాలతో కేసీఆర్ మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.