ఈ సీజన్ నుంచి నియంత్రిత సాగు: కేసీఆర్

రైతులు డిమాండ్ ఉన్న పంటలనే వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. గత మూడురోజులుగా కేసీఆర్ వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం మరోసారి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నియంత్రిత సాగుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వర్షాకాల సీజన్ నుంచి రాష్ట్రంలో నియంత్రిత సాగు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అధికారులు ఈమేరకు రైతులను సన్నద్ధం చేయాలని సూచించారు. ఈ సీజన్ నుంచి ప్రతీయేటా దీనిని […]

Written By: Neelambaram, Updated On : June 3, 2020 7:10 pm
Follow us on


రైతులు డిమాండ్ ఉన్న పంటలనే వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. గత మూడురోజులుగా కేసీఆర్ వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం మరోసారి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నియంత్రిత సాగుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వర్షాకాల సీజన్ నుంచి రాష్ట్రంలో నియంత్రిత సాగు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అధికారులు ఈమేరకు రైతులను సన్నద్ధం చేయాలని సూచించారు. ఈ సీజన్ నుంచి ప్రతీయేటా దీనిని కొనసాగించాలని అధికారులకు సూచించారు.

వ్యవసాయ లాభసాటిగా మార్చాలంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలన్నారు. దీనికోసం వ్యవసాయాధికారులు నిరంతరం రైతులకు సాగుపై తగు సూచనలు చేయాలన్నారు. అవసరమైన ప్రణాళికలను రూపొందించాలన్నారు. పంటలకు డిమాండ్ ఉంటేనే మార్కెట్లో గిట్టుబాటు ధర వస్తుందన్నారు. రైతులు అల్లం, ఆలు, వెల్లుల్లి వంటి డిమాండ్ ఉన్న పంటలను పండించాలని సూచించారు. త్వరలోనే కాటన్ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సీజన్ తగ్గట్లు ఏయే పంటలు వేయాలో అధికారులు సూచనలు చేస్తారని రైతులు ఆ పంటలను వేయాలన్నారు.

వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను సరిపడా సిద్దం చేసినట్లు తెలిపారు. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలువాలన్నారు. వ్యవసాయంలో అవలంభించనున్న పద్ధతుల ద్వారా త్వరలోనే వ్యవసాయ లాభసాటిగా మారనుందని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, అగ్రో బిజినెస్ కన్సల్టెంట్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.