National Progressive Party : కేరళలో నేషనల్ ప్రొగ్రెసివ్ పార్టీ పేరిట కొత్త పార్టీ పురుడుపోసుకుంది. ఇది బీజేపీకి అనుబంధంగా పనిచేయడానికి సిద్ధమైంది. 2022 సెప్టెంబర్ 17న కొచ్చిన్ లో 1000 మంది క్రైస్తవ సమావేశం జరిగింది. అన్ని రకాల చర్చి పెద్దలు, బిషప్ లు పాల్గొన్నారు. రాజకీయ నేతలు కూడా ఇందులో పాల్గొనడం గమనార్హం. ఇందులో 12 అంశాలు డిమాండ్లుగా పెట్టారు. వీరే ఇప్పుడు పార్టీగా పెట్టుకున్నారు.
దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి అక్కడ స్థానం దక్కడం లేదు. అయితే కాంగ్రెస్ లేదంటే కమ్యూనిస్టులనే ఆదరిస్తున్నారు. హిందుత్వ బీజేపీని ఎవరూ ఆదరించడం లేదు. క్రైస్తవులు, ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఈరాష్ట్రం బీజేపీకి కొరుకుడు పడడం లేదు. అందుకే క్రైస్తవ బిషప్ లతో నరుక్కొస్తోంది బీజేపీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా రహస్యంగా కేరళ క్రైస్తవులతో
క్రిస్టియన్ల హక్కులు, రైతులకు మద్దతు ధరను ప్రధాన ఏజెండాగా ఈ పార్టీ పెట్టుకుంది. ఈ క్రమంలోనే క్రైస్తవ బిషప్ ల మద్దత్తుతో కేరళలో కొత్త పార్టీ ఏర్పాటు పర్యావసనాలపై ‘రామ్ గారి ’ సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.