AP Govt- New File Jumping System: ఏదైనా పాలనాపరమైన నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. కానీ దానిని అమలుచేసే బాధ్యత మాత్రం యంత్రాంగానిది. రాజ్యాంగం కూడా ఇదే మాట చెబుతోంది. ఏదైనా రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తోంది. ఇప్పటివరకూ జరిగినది అదే. కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. నిర్ణయమూ ప్రభుత్వమే తీసుకుంటోంది. దాని అమలు బాధ్యత కూడా అదే తీసుకుంటోంది. అంతలా దూకుడును ప్రదర్శిస్తోంది ఏపీ సర్కారు. అస్మదీయులకు పనులు కావాలన్నా, ఎవరికైనా ఇతోధికంగా సాయం చేయాలన్నా ఇట్టే ఫైల్స్ కదులుతున్నాయి. దగ్గరుండి మన నేతలు కదిలిస్తున్నారు. ఫైల్స్ కు ఆమోదం, ఉత్వర్వులు అన్ని తమ ఇష్టరాజ్యంగా క్రియేట్ చేస్తున్నారు. వాటికి ఎటువంటి ప్రత్యేక ఉత్వర్వులు లేకుండా అమలుచేస్తున్నారు. అసలు యంత్రాంగంతో పని లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. వారు పరిశీలంచకుండానే ఏపీలో చకచకా పనులు జరిగిపోతున్నాయి.

ఆ పరిశీలనలు లేకుండా..
ఒక వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం చేయదలచుకుంటే ఫైల్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి నిధులు మంజూరు చేసే వరకూ ఐదారు దశల్లో పరిశీలన ఉంటుంది. వడబోసి చివరకు అర్హుడైతేనే సాయం మంజూరయ్యేది. అసలు సాయం పొందాలనుకున్న వ్యక్తి అర్హత ఏమిటి? దానికి అర్హుడా? నిజంగా రుగ్మతతో బాధపడుతున్నాడా? ప్రభుత్వం సాయం చేసేటంత కష్టంలో ఉన్నాడా? అని పరిశీలించి..వడబోసి జాబితా రూపొందించేవారు. తుది జాబితా సిద్ధం చేసి బాధితుడికి సాయం చేసేవారు. దీనివల్ల అవినీతికి అవకాశం ఉండకూదని అలా చేసేవారు. పారదర్శకత కోసం పరిశీలనలు జరిపేవారు.
Also Read: Congress President: కాంగ్రెస్ పగ్గాలు అశోక్ గెహ్లాట్ కు.? వృద్ధ జంబూకాలతో పార్టీ నడుస్తుందా?
వివరాలు కచ్చితత్వంగా ఉండేలా నమోదుచేసుకునేవారు. కానీ ప్రస్తుతం ఏపీలో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడంతా జంపింగ్ ఫైల్స్ నడుస్తున్నాయి. సాయం కోసం అస్మదీయుడు చేయిచాస్తే చాలు ఫైల్ కు ఇట్టే కాలు వస్తున్నాయి. వడపోత పరిశీలనలు లేకుండా తుది సాయానికి ఫైల్ ను క్లీయరెన్స్ చేస్తున్నారు. మధ్యలో ఉండే అధికారులు, ఉద్యోగుల సంతకాలు ఉండనవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటే సింగిల్ విండో విధానంలో బాధితుడికి సాయం నేరుగా చేర్చుతున్నారు. ఒక వేళ ఫైల్ విషయంలో ఏ మాత్రం అవినీతి ఆరోపణలు వచ్చినా..పారదర్శకత లోపించినట్టు వెలుగుచూసినా అందుకు బాధ్యులెవరని అడిగితే మాత్రం.. ఆ ఒక్కటీ అడక్కు అన్న రేంజ్ లో మాత్రం సమాధానం వస్తోంది.

వివాదాస్పద నిర్ణయాలు
ఏపీలో ఫైల్స్, జీవోల జాబితా వెబ్ సైట్ లో పెట్టడం మానేశారు. కోర్టులు ఆదేశించినా బేఖాతరు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే అడ్డగోలుగా వాదిస్తున్నారు. అంతటితో ఆగకుండా వితండ వాదనకు దిగుతున్నారు. వైసీపీ సర్కారు అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. రూల్స్ కు విరుద్ధంగా పాలన సాగుతోంది. అయితే ఇదంతా అధికార గణానికి తెలుసు. కానీ ఏంచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ప్రభుత్వాలు, నాయకులు మారిపోతుంటారు. కానీ అధికార యంత్రాంగం శాశ్వతం అన్న విషయాన్ని మరిచిపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు, నిబంధనలకు విరుద్ధంగా సాగిస్తున్న పాలన భవిష్యత్ లో అధికారుల మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి నిర్ణయాలు వల్ల మారిపోయే ప్రభుత్వానికి పాలకులకు ఇబ్బంది ఉండదు కానీ.. అధికార గణానికి మాత్రం ఈ తప్పిదాలు వెంటాడే అవకాశముంది.
Also Read:Apple: చైనాకు ఆపిల్ రాం రాం.. అన్ని దేశాలను కాదని భారత్ వైపు చూపు


[…] […]
[…] […]