AP New Districts: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో ఎవరికి తెలియదు. ఏం మాట్లాడతారో కూడా అర్థం కాదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీలు ఏం మాట్లాడాలో దిశానిర్దేశం చేయాల్సిన సమయంలో ఆయన కొత్త జిల్లాల ఏర్పాటు గురించి మాట్లాడి అందరిని ఆశ్చర్య పరచారు. అసలు పార్లమెంట్ లో మన వ్యూహమేంటి? మన వైఖరేంటి? కేంద్రంపై యుద్ధం చేసి మనం సాధించుకోవాల్సిన అంశాలేమిటి? అనే వాటిపై చర్చించాల్సిన ఉన్నా కొత్త జిల్లాల ఏర్పాటు గురించి మాట్లాడి అందరిలో అనుమానం పెంచుతున్నారు. అసలు జగన్ ఎందుకు ఈ విధంగా మాట్లాడారో ఎవరికి అర్థం కావడం లేదు.

ఇప్పటికే మూడు రాజధానుల వ్యవహారంలో రాష్ర్ట ప్రభుత్వం ఇరుకున పడగా మళ్లీ శాసన మండలి రద్దును వెనక్కి తీసుకుని ఇచ్చిన మాటను తప్పిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆ అప్రదిష్టను పోగొట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రచారం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: కొత్త జిల్లాల ఊసు.. పనొకిస్తుందా జగన్ బాసూ?
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఓ ప్రాసెస్ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు చేసే ప్రక్రియ కాదని తెలిసినా జగన్ ఎందుకు ఈ విధంగా ప్రచారం చేయాలని చూస్తున్నారో అర్థం కావడం లేదని వైసీపీ నేతలే పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల సరిహద్దులను మార్చాలంటే చాలా పని ఉంటుంది. అది అందరికి తెలిసిందే అయినా ఆయన మాత్రం ఏదో ఆశించి ఈ ప్రస్తావన తెస్తున్నారని మాత్రం తెలుస్తోంది.
ఇప్పటికే భౌగోళిక సరిహద్దులు మార్చరాదని ఫ్రీజ్ ఉత్తర్వులు అమల్లో ఉన్న కారణంగా కొత్త జిల్లాల ప్రక్రియ ముందుకు సాగడం గగనమే. కానీ జగన్ మాత్రం ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా చేయాలనే ఉద్దేశంతోనే కొత్త జిల్లాల ఊసు బయటకు తెచ్చి ప్రజలను తమ దారికి తిప్పుకోవాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో జగన్ ఇంకా ఏ సంచలన నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Also Read: ఏపీలో మద్యంపై సర్కార్ ఆదాయం తెలిస్తే కళ్లు బైర్లు