
ఏప్రిల్ 20న.. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పుట్టినరోజు. నేడు చంద్రబాబు 71 పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. అయితే.. పుట్టిన రోజు సందర్భంగా బాబుకు ఊహించని దెబ్బ తగిలింది. సోషల్ మీడియా వేదికగా.. ఫోన్లు చేస్తూ అందరూ చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు.. కార్యకర్తలు కూడా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ బర్త్‌డే వేడుకలు జరుపుతున్నారు.
ట్విట్టర్‌లో మాత్రం ఊహించని పరిస్థితి ఎదురైంది. బర్త్‌డే సందర్భంగా #HBDCBN ఉండాల్సింది పోయి.. #HBDTelugu420CBN అంటూ ట్వీట్లు హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు ట్విట్టర్‌లో ఇదే హ్యాష్ ట్యాగ్ మోత మోగుతోంది. ఇక ఈ ట్వీట్ కాస్త వైసీపీ వారికి పండుగను తెచ్చినట్లు అయింది.
అదే హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. షేర్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. ఈ హ్యాష్ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉండడంతో అందరూ అవాక్కవుతున్నారు. మరోవైపు.. ఇదంతా వైసీపీ కార్యకర్తల కుట్ర అని టీడీపీ కార్యకర్తలు.. చంద్రబాబు అభిమానులు మండిపడుతున్నారు. అంత సీనియర్ లీడర్‌ను ఈ విధంగా అవమానిస్తారా అంటూ ఆగ్రహానికి గురవుతున్నారు.
ఇదిలా ఉండగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబు పుట్టిన రోజు కావడంతో ట్వీట్ చేశారు. ‘ఏపీలో ఆఫీసులు మూసేయడంతో పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు. పైగా కరోనా వల్ల బర్త్‌డే ఘనంగా చేయ్యవద్దంటూ సందేశం. 17 తర్వాత ‘‘పార్టీ లేదు బొక్కాలేదన్న’’ సందేశాన్ని ఇప్పటికే మీ వాళ్లు పాటిస్తున్నారులే బాబు. మళ్లీ నీ ‘బ్రీఫ్ డు అవసరం లేదు’ అంటూ షాకిచ్చారు. ఈ ట్వీట్‌ను చూసిన తమ్ముళ్లు విజయసాయిపై మండిపడుతున్నారు. ఒక హోదాలో ఉండి అలాంటి మెస్సేజ్‌లు పెట్టడం ఏంటంటూ నిలదీస్తున్ఆరు.