https://oktelugu.com/

ఆ భేటీపై భగ్గుమన్న బండి సంజయ్‌

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తమ పార్టీ అధ్యక్షుడికి చెప్పకుండానే బీజేపీకి చెందిన కొందరు లీడర్లు తెలంగాణ కేబినెట్‌ మినిస్టర్‌‌ కేటీఆర్‌‌తో భేటీ అయ్యారు. ఈ భేటీని ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. కేవలం ఒక కార్పొరేటర్‌‌ సీటు ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీతో చర్చలు జరపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధ్యక్షుడిగా తెలియకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఏకంగా దీనిపై విచారణ కోసం ఓ […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 20, 2021 2:33 pm
    Follow us on

    BJP
    తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తమ పార్టీ అధ్యక్షుడికి చెప్పకుండానే బీజేపీకి చెందిన కొందరు లీడర్లు తెలంగాణ కేబినెట్‌ మినిస్టర్‌‌ కేటీఆర్‌‌తో భేటీ అయ్యారు. ఈ భేటీని ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. కేవలం ఒక కార్పొరేటర్‌‌ సీటు ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీతో చర్చలు జరపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధ్యక్షుడిగా తెలియకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఏకంగా దీనిపై విచారణ కోసం ఓ కమిటీని నియమించింది. ఈ ప్రతిపాదన ఎవరు తీసుకొచ్చారు..? ఎవరి నేతృత్వంలో ఇది జరిగింది..? వాటిని నిగ్గు తేల్చేందుకు ఈ కమిటీ నియామకం జరిగింది.

    భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో బలపడుతోంది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికతో తన సత్తా చాటింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి పార్టీ అంటే ఏంటో నిరూపించారు. ఇప్పటికే నాగార్జునసాగర్‌‌ ఉప ఎన్నిక ముగిసింది. ఇంకా ఆ రిజల్ట్‌ వచ్చేది ఉంది. మరోవైపు.. ప్రస్తుతం కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన పలువురు వెళ్లి మంత్రి కేటీఆర్‌‌ను కలవడం ఏంటని అధిష్టానం ఆవేశంతో ఉంది. ఈ టైమ్‌లో ఇలా వెళ్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్టానం భావిస్తోంది.

    అయితే.. ఇదంతా ఎవరి డైరెక్షన్‌లో జరిగిందని కూపీలాగే ప్రయత్నం చేస్తోంది అధిష్టానం. అందుకే.. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీలో సీనియర్‌‌ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌‌, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఉన్నారు. వీరు రెండు రోజుల్లో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇస్తారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆ నివేదికను పరిశీలిస్తారు. తదుపరి నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటారు.

    లింగోజిగూడ కార్పొరేటర్‌‌ ప్రమాణస్వీకారం చేయకముందే చనిపోయారు. దీంతో ఆ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని పలువురు నేతలు కలిసి మంత్రి కేటీఆర్‌‌ను కలిశారు. ఇదే అంశాన్ని అధిష్టానం సీరియస్‌గా పరిగణించింది. అంతేకాదు.. ఈ వ్యవహారమంతా కూడా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలియకుండానే జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకుండా ఇలాంటి సాహసం చేయడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. అయితే.. ఇప్పటికే పార్టీలో కిషన్‌ రెడ్డికి, సంజయ్‌కి మధ్య విభేదాలున్నాయని.. ఇద్దరికీ పొసగట్లేదని ప్రచారం నడుస్తోంది. ఇదే తరుణంలో ఇప్పుడు అధ్యక్షుడికే తెలియకుండా ఈ ఘటన చోటుచేసుకుంది. మరి దీనిపై ఫ్యూచర్‌‌ పరిణామాలు ఎలా ఉండబోతాయనేది చర్చ నడుస్తోంది.