
Kethamreddy Vinod Reddy: జనసేన..మిగతా రాజకీయ పక్షాలకు భిన్నం. ఏది నష్టం? ఏది లాభం? అన్న భేరీజు వేసుకునే పార్టీ కాదు. రాత్రికి రాత్రే అధికారంలోకి రావాలన్న కాంక్ష లేదు. సమాజంలో మార్పు, ప్రజలను చైతన్యవంతం చేసేందుకే ఆ పార్టీ ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే ఇన్నేళ్లు మనగలుగుతూ వస్తోంది. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతున్నా..అధికారంలోకి రాకున్నా.. ఆ పార్టీ మనుగడ సాధించడానికి ప్రధాన కారణం ఆ భావజాలమే. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. అటుపోట్లకు తట్టుకొని లక్షలాది మంది జన సైనికులు పార్టీకి అంటిపెట్టుకొని ఉన్నారు. రోజురోజుకూ పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. ఇంతింతై వటుటింతై అన్న చందంగా పార్టీ ఎదుగుతుందే తప్ప.. ఎక్కడా తగ్గిన దాఖలాలు లేవు. అందుకే తమను అధికారం నుంచి దూరం చేస్తుందని అధికార పక్షానికి భయం. జనసేన తోడు లేనిదే అధికార పక్షాన్ని ఎదురొడ్డలేమని ప్రధాన విపక్షం ఆందోళన. అయితే ఈ క్రమంలో జనసేనను తొక్కేయ్యాలన్నదే అధికార, ప్రధాన విపక్షాల ఏకైక అజెండా.
Also Read: Kanna Lakshminarayana: అటు తిరిగి.. ఇటు తిరిగి కన్నా అడుగులు అటువైపు..
అయితే రాష్ట్రంలో అధికార పార్టీని గద్దె దించాలంటే పొత్తులు అనివార్యం. ప్రధానంగా టీడీపీని కాపాడుకోవాలంటే జనసేన తోడు చంద్రబాబుకు అవసరం. అలాగని జనసేన బలపడకూడదన్నది మరో అభిప్రాయం. అందుకే అటు స్నేహం కోసం చేయి అందిస్తునే,…చంద్రబాబు వెనుక నుంచి రాజకీయాలు చేస్తుంటారు. తనకు పవన్ అడ్వాంటేజ్ కావాలని కోరుకుంటున్నారే తప్ప.. జనసేన బలం పెంచుకోకూడదని భావిస్తున్నారు. అందుకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో జనసేనకు బలమైన అభ్యర్థులు లేకుండా చేసే పనిలో పడ్డారు. ఇందుకు ఒక గ్రౌండ్ వర్క్ ను ప్రిపేర్ చేస్తున్నారు. జనసేన వైపు వెళ్లే చాలామంది నాయకులను కట్టడి చేస్తున్నారు. తనవైపునకు తిప్పుకుంటున్నారు.

గత కొద్దిరోజులుగా మహాసేన రాజేష్ మనసు జనసేన వైపు ఉండేది. జనసేనతో పాటు పవన్ కు అనుకూలంగా ఆయన వ్యవహార శైలి నడిచేది. దీంతో రాజేష్ జనసేనలో చేరుతారని అంతా భావించారు. కానీ ఆయన అనూహ్యంగా టీడీపీ వైపు మొగ్గుచూపారు. రాజేష్ ను తన వద్దకు పిలిపించుకున్న చంద్రబాబు ఏకంగా ఒక ఎంపీ కానీ.. ఎమ్మెల్యే సీటు కానీ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన మనసు మార్చుకున్నారు. ఆయనకు టీడీపీ సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున రాజేష్ పనిచేశారు. కానీ ఎన్నికల అనంతరం వైసీపీకి దూరమయ్యారు. వైసీపీపై విమర్శలు చేసే క్రమంలో ఆయన కేసులు ఎదుర్కొన్నారు. దీనిపై పవన్ తో పాటు నాగబాబు స్పందించిన సందర్భాలున్నాయి. దీంతో ఎన్నికల ముందు నాటి విషయాలను గుర్తించుకొని మహాసేన రాజేష్ మెగా బ్రదర్స్ కు క్షమాపణలు కోరారు. జనసేనకు దగ్గరైనట్టే అయ్యి.. టీడీపీ వైపు టర్న్ అయ్యారు. దీని వెనుక చంద్రబాబు వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది.
జనసేనకు పేరుమోసిన నాయకుల్లో కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఒకరు. గత ఎన్నికల్లో ఓటమి తరువాత జనసేన నుంచి బరిలో దిగిన నాయకులు కనుమరుగయ్యారు. కానీ వినోద్ రెడ్డి మాత్రం అన్నింటికీ తట్టుకొని నిలబడ్డారు. ఆర్థిక వనరులు అంతంతమాత్రంగా ఉన్నా పార్టీ కార్యక్రమాలను మాత్రం కొనసాగిస్తూ వచ్చారు. అయితే నెల్లూరులో చిన్నపాటి వర్గ విభేదాలపై స్పందించిన నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు కేతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించక ముందే.. తెలుగుదేశం పార్టీ నాయకులు కేంతరెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదిపారు. ఒక వైపు జనసేనతో పొత్తు కోరుకుంటూనే.. మిత్రభేదంతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. జనసేన నేతలను, పార్టీలో చేరాలనుకుంటున్న నాయకులను తమ వైపు తిప్పుకుంటున్నారు. తమ వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నారు.
Also Read: PM Modi Meets Actors: కేజీఎఫ్, కాంతారా హీరోలతో మోడీ స్కెచ్.. ప్రత్యర్థులకు నోట మాటరాదంతే!