https://oktelugu.com/

Drugs Case: డ్రగ్స్ కేసులో ట్విస్ట్: షారుఖ్ ఖాన్, అనన్య పాండే ఇంటిపై ఎన్సీబీ దాడి

Drugs Case: డ్రగ్స్ కేసు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే ముంబై టు గోవా వెళుతున్న క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీ చేసుకొని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యాడు. తాజాగా అతడి ఫోన్ నుంచి తీసుకున్న సమాచారంతో ఎన్సీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ గురించి ఒక బాలీవుడ్ యువ నటితో చర్చించినట్టు అందులో పేర్కొంది. కట్ చేస్తే […]

Written By: , Updated On : October 21, 2021 / 01:41 PM IST
Follow us on

Drugs Case: డ్రగ్స్ కేసు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే ముంబై టు గోవా వెళుతున్న క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీ చేసుకొని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యాడు. తాజాగా అతడి ఫోన్ నుంచి తీసుకున్న సమాచారంతో ఎన్సీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ గురించి ఒక బాలీవుడ్ యువ నటితో చర్చించినట్టు అందులో పేర్కొంది.

Shahrukh khan ananya pande

Shahrukh khan ananya pande

కట్ చేస్తే తాజాగా ఎన్సీబీ అధికారులు బాలీవుడ్ యువ నటి.. విజయ్ దేవరకొండ ‘లైగర్’ హీరోయిన్ అనన్య పాండే ఇంటిపై దాడులు చేశారు. డ్రగ్స్ కేసు విచారణ కోసం ఎన్సీబీ అధికారులు అనన్య పాండే ఇంటికి చేరుకున్నారు. ఆమె ఇంట్లో సోదాలు కూడా చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు డ్రగ్స్ కేసులో అనన్య పాండేను విచారణకు పిలిచారు. అనన్య తోపాటు ఆర్యన్ ఖాన్ సోదరి సుహానా ఖాన్ పేరు కూడా డ్రగ్స్ చాట్ లో కనిపించినట్లు తెలిసింది.

అనన్యపాండే ఇంటిపై దాడులు చేసిన అనంతరం ఎన్సీబీ అధికారులు షారుఖ్ ఖాన్ కూడా షాకిచ్చారు. ఆయన అర్థర్ జైల్లో తన కుమారుడిని పరామర్శించిన వచ్చిన వెంటనే షారుఖ్ ఇళ్లు మన్నాట్ పై ఎన్సీబీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేశారు.

షారుఖ్ కుమారుడు ఆర్యన్ కు అనన్య చాలా దగ్గరి స్నేహితురాలు. వీరిద్దరూ వాట్సాప్ లో డ్రగ్స్ పై చాటింగ్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు ముంబై కోర్టులో తెలిపారు. ఈ క్రమంలోనే ఈ కేసులో అనన్య పాండే కూడా బుక్ కావడం ఖాయమంటున్నారు.