Naxalism : ఆపరేషన్ కగార్ లో భాగంగా భీకరమైన ఎన్ కౌంటర్లు చోటుచేసుకుంటున్నాయి.. ఇటీవల కాలంలో దాడులు ఉదృతంగా సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెక్కుసంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. ఒకరకంగా ఇది వామపక్ష తీవ్రవాద ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. నిజానికి వామపక్ష తీవ్రవాద ఉద్యమానికి తెలుగువారే అనాది కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967 లో వెస్ట్ బెంగాల్ లోని నక్సల్ బరి ప్రాంతంలో వామపక్ష ఉద్యమం మొదలైంది.. ఆ తర్వాత దీనికి శ్రీకాకుళం జిల్లాలోని వెంపటపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసం, సుబ్బారావు, పాణిగ్రాహి వంటి వారు సాయుధ తిరుగుబాటును పరిచయం చేశారు. ఇక ఇక్కడి నుంచి ఉద్యమం సరికొత్త రూపు దాల్చింది. మార్క్సిస్ట్, లెనినిస్ట్ భావజాలాన్ని అందిపుచ్చుకుని.. భవిష్యత్తు మావోయిస్టు కార్యకలాపాలకు బలమైన పునాదివేసింది.
Also Read : సినీ ఇండస్ట్రీ పై పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం..ఆ నలుగురి సినిమాలపై వేటు?
1980లో కొండపల్లి సీతారామయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీపుల్స్ వార్ గ్రూప్ ను స్థాపించారు. నక్సలైట్ ఉద్యమంలో పీపుల్స్ వార్ గ్రూప్ అత్యంత బలమైన సాయుధ దళంగా ఏర్పాటయింది. గ్రామీణ ప్రాంతాలలో విప్లవాలను బలోపేతం చేసింది. ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర తెలంగాణ లోని కొన్ని ప్రాంతాలలో విస్తరించిన దండకారణ్యాలలో గెరిల్లా యుద్ధాలలో శిక్షణ ఇచ్చేవారు.. ఇవన్నీ కూడా మావోయిస్టులకు వ్యూహాత్మక మండలాలుగా మారాయి. సెంట్రల్ మిలిటరీ కమిషన్, సెంట్రల్ టెక్నికల్ యూనిట్, ఇంటెలిజెన్స్ వింగ్ వంటి విభాగాలలో ఆంధ్రప్రదేశ్ నాయకులకు కీలక పాత్ర పోషించేది. కరీంనగర్, వరంగల్, నల్లగొండ వంటి జిల్లాలకు చెందినవారు ఈ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించేవారు. పైగా చాలామంది పొలిట్ బ్యూరో సభ్యులు ఈ ప్రాంతాల నుంచి వచ్చారు. 2004లో పీపుల్స్ వార్ గ్రూప్ ఎంసీసీఐ లో విలీనం అయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ నాయకులు తమ వ్యూహాత్మకతను మరింత బలోపేతం చేసుకున్నారు. సైతాంతిక నియంతలను నిలుపుకున్నారు..
కరీంనగర్ జిల్లాకు చెందిన ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేశారు. 2018 వరకు ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కిష్టన్న అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు తూర్పు భారతదేశంలో ముఖ్యంగా జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాలలో మావోయిస్టు పార్టీ విస్తరణకు కృషి చేశారు. ఇక గణపతి తర్వాత జనరల్ సెక్రెటరీగా నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు పనిచేశారు. నంబాల కేశవరావు సైనిక వ్యూహాలలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్ర మావోయిస్టులు అర్బన్ ఫ్రంట్ సంస్థలు, విద్యార్థి, కార్మిక, దళిత ఫ్రంట్ లు ఏర్పాటు చేయడం,సామూహిక సమీకరణ వ్యూహాలలో కేశవరావు ప్రసిద్ధి చెందారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో విప్లవ రచయిత సంఘాలు, సాంస్కృతిక సంస్థలు కీలకపాత్ర పోషించాయి. ఇదే సమయంలో పీపుల్స్ సెలబ్రేషన్ గెరిల్లా ఆర్మీ ని అభివృద్ధి చేయడంలో, ఐఈడీ, అంబూష్, అడవి యుద్ధాలలో మావోయిస్టు కార్యకలాపాలను మరింత ప్రభావితం చేయడంలో తెలుగువారు కీలకపాత్ర పోషించారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రే హౌండ్స్ విభాగాన్ని అభివృద్ధి చేసినప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.. మావోయిస్టులకు తీవ్రమైన దెబ్బ తగిలింది.. ఛత్తీస్ గడ్, జార్ఖండ్ రాష్ట్రాలకు తెలుగు నాయకులు అజ్ఞాతవాసానికి వెళ్లిపోయారు.
” ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు మావోయిస్టు యంత్రాంగంలో కీలకపాత్ర పోషించారు. మిలిటెంట్, రాజకీయ సంస్కృతి, దీర్ఘకాలిక దృక్పథం, సైద్దాంతిక దృఢత్వం నింపడంలో కీలక పాత్ర పోషించారు. పి ఎల్ జి ఏ, సిపిఐ (మావోయిస్టు) పార్టీలలో బలమైన అధికార దళంగా పనిచేశారు. నక్సలైట్ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించేలా కృషి చేశారు. మాట్లాడు నుంచి సాయుధ తిరుగుబాటు వరకు ఇక నిర్మాణాలు చేపట్టారు. అయితే ప్రభుత్వాల అణచివేత వల్ల ఉద్యమాలు ఇప్పుడు తిరుగు ముఖం పట్టాయి. నాటి నాయకులు ఇప్పుడు లేరు. రిక్రూట్మెంట్లు కూడా ఆగిపోయాయని” నక్సల్ బరి ఉద్యమాన్ని మొదటి నుంచి చూస్తున్న సీనియర్ పాత్రికేయులు చెబుతున్నారు. మొత్తంగా వామపక్ష ఉద్యమంలో తెలుగువారు కీలక భూమిక పోషించగా.. ఇప్పుడు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్న నేపథ్యంలో.. ఉద్యమం అనేది చుక్కాని లేని నావలాగా మారిపోయింది.