https://oktelugu.com/

సిద్దూ హిట్ వికెట్.. కాంగ్రెస్ ను నిండా ముంచాడు

నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఇతడిని పీసీసీ చేయడం కోసం ఏకంగా పంజాబ్ ముఖ్యమంత్రినే మార్చింది కాంగ్రెస్ అధిష్టానం. సీనియర్ సీఎం అమరీందర్ సింగ్ ఎంత వ్యతిరేకించినా సిద్దూను పీసీసీ చీఫ్ చేసింది. దీంతో అలిగి సీఎం పదవి నుంచి అమరీందర్ వైదొలిగినా వెనక్కి తగ్గలేదు. అయితే ఇంత ప్రాధాన్యం ఇచ్చిన సిద్దూ చివరకు కాంగ్రెస్ ను నట్టేట ముంచేశాడు. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశాడు. దీంతో కాంగ్రెస్ కు వ్రతం చెడ్డా ఫలితం దక్కలేని చందంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 29, 2021 / 08:43 AM IST
    Follow us on

    నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఇతడిని పీసీసీ చేయడం కోసం ఏకంగా పంజాబ్ ముఖ్యమంత్రినే మార్చింది కాంగ్రెస్ అధిష్టానం. సీనియర్ సీఎం అమరీందర్ సింగ్ ఎంత వ్యతిరేకించినా సిద్దూను పీసీసీ చీఫ్ చేసింది. దీంతో అలిగి సీఎం పదవి నుంచి అమరీందర్ వైదొలిగినా వెనక్కి తగ్గలేదు. అయితే ఇంత ప్రాధాన్యం ఇచ్చిన సిద్దూ చివరకు కాంగ్రెస్ ను నట్టేట ముంచేశాడు. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశాడు. దీంతో కాంగ్రెస్ కు వ్రతం చెడ్డా ఫలితం దక్కలేని చందంగా మారింది.

    పంజాబ్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ లో విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం ఊపందుకోవడంతో మళ్లీ ఓ పిడుగు పడింది. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతిసింగ్ సిద్దూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ డైలమాలో పడిపోయింది. దీంతో ఇద్దరు దిగ్గజ నేతలు వైదొలగడంతో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ లు తగులుతున్నాయి. కోలుకోలేని దెబ్బ మారింది.

    సిద్దూ తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని సిద్దూ స్పష్టం చేశారు. భవిష్యత్ లో పార్టీ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. పంజాబ్ లోని 117 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక పాత్ర పోషించారు. కానీ ఆయన సేవలు గుర్తించని అధిష్టానం ఆయనతో రాజీనామా చేయించింది. దీంతో అమరీందర్ బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్ లో భయం పట్టుకుంది.

    అయితే అమరీందర్ సింగ్, నవజ్యోతి సింగ్ సిద్దూ మధ్యలో అప్పట్టోనే అభిప్రాయ భేదాలు రావడంతో పీసీసీ అధ్యక్ష పదవి కోసం సిద్దూ వద్దని అమరీందర్ వారించినా అధిష్టానం చొరవ తీసుకుని సిద్దూకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. కానీ తదనంతర పరిణామాల్లో ఇద్దరి మధ్య అగాధం మరింత పెరిగిపోయి చివరికి అమరీందర్ రాజీనామా వరకు వెళ్లింది. కానీ అధిష్టానం మాత్రం పట్టించుకోకపోవడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం అమరీందర్ బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకోవడంతో సిద్దూ రాజీనామా కాంగ్రెస్ కు భారీ దెబ్బగా మారింది. అటు అమరీందర్ దూరమై.. ఇటు సిద్దూ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారింది. పార్టీ పుంజుకోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

    ఈ నేపథ్యంలో పంజాబ్ లో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఒక్క రోజే ఇద్దరు నేతలు పార్టీకి దూరం కావడం పార్టీకి మింగుడు పడటం లేదు. అధిష్టానం సరైన దిశానిర్దేశం చేయకపోవడంతో కాంగ్రెస్ లో లుకలుకలు తారాస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో కోలుకోవడం ఇక కష్టమేనని తెలుస్తోంది.