Homeజాతీయ వార్తలుచైనా దూకుడుకు చెక్ పెట్టనున్న మోదీ!

చైనా దూకుడుకు చెక్ పెట్టనున్న మోదీ!


భారత సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాతో తేల్చుకునేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు శాంతియుతంగా చర్చలు అంటూనే దొంగదెబ్బ కొడుతున్న చైనాను కట్టడి చేసేందుకు కేంద్రం తగిన వ్యూహాన్ని రచిస్తోంది. గాల్వానాలో చైనా దుస్సాహాసం చేసి 20మంది జవాన్లు పొట్టనపెట్టుకున్నదే కాకుండా భారత సైనికులే సరిహద్దు దాటి చైనాలోని ప్రవేశించి దాడి చేశారని ఆరోపణలు చేస్తోంది. చైనా మీడియాలో భారత సైనికులే ముందు దాడి చేశారంటూ తప్పుడు కథనాలను ప్రచురితం చేస్తూ ప్రపంచం దృష్టిలో భారత్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దు వివాదంలో చైనా వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. చైనా అంశాన్ని త్వరగా తేల్చేందుకు ప్రధాని మోదీ ఈనెల 19న ఆల్ పార్టీ పిలుపుకు పిలువడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సోమవారం రాత్రి 3గంటల సమయంలో గాల్వానాలో చైనా-భారత్ మధ్య ఘర్షణ జరుగగా భారత జవాన్లు 20మంది వీరమరణం పొందిన సంగతి తెల్సిందే. గత నెలరోజులుగా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడగా ఇరుదేశాలు ఆర్మీ, దౌత్య భేటిలు నిర్వహిస్తున్నారు. ఇందులో చర్చలు కొలిక్కిరాగా ఎల్ఓసీ నుంచి ఇరుదేశాల సైనికులు కొంతమేరకు వెనక్కి వెళుతున్న క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. చైనీయులు పక్కా ప్లాన్ తో రాళ్లు, కర్రలతో భారత జవాన్లపై దాడి దిగినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే భారత జవాన్లు చైనా సైనికులపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో భారత్ కు చెందిన 20మంది సైనికులు వీరమరణం పొందగా చైనాకు చెందిన 35మంది సైనికులు మృతి చెందినట్లు సమాచారం. అయితే చైనా సైనికులు ఎంతమంది చనిపోయారనేది అధికారికంగా చైనా ఆర్మీ ప్రకటించలేదు.

సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20మంది జవాన్లు వీరమరణం పొందటంపై యావత్ దేశం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అసలు భారత్-చైనా సరిహద్దుల్లోని లఢక్ ప్రాంతంలో ఏం జరుగుతుందో మోదీ సర్కార్ ప్రజలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. భారత జవాన్ల మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాల్లో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ చైనా అంశాన్ని త్వరగా తేల్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 19న సాయంత్రం 5గంటలకు అన్నిపార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి చైనా అంశంపై అభిప్రాయాలు తీసుకోనునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని అన్నిపార్టీల అధ్యక్షులు పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేయాలని ఈమేరకు ప్రధాని కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో కోరినట్లు తెలుస్తోంది. ఈ బేటీలో సమష్టి నిర్ణయం తీసుకొని తదునుగుణంగా ముందుకెళ్లాలని కేంద్రం ఆలోచిస్తుంది. భారత జవాన్ల మృతికి భారతీయులంతా నివాళ్లర్పిస్తూనే చైనా దుస్సాహసానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ చైనాకు ఏవిధంగా చెక్ పెడుతుందనేది ఆసక్తిని రేపుతోంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version