Narendra Modi: దేశానికి నాయకుడు కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాలి. క్లారిటీతో ముందుకెళ్లాలి. అప్పుడే ఆ పార్టీపై నమ్మకం , ఆదరణ కలుగుతుంది. ఇప్పుడు బీజేపీలో చేస్తోంది అదే. కులాలు, మతాల కుంపట్లతో రగిలే ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి భవ బంధాలు, బంధుత్వాలు లేని ఒక యోగిని సీఎం చేసేశారు. ఆయనకు అలిగేషన్స్ లేకపోవడంతో అక్కడ బీజేపీ హిట్ అయ్యింది. రెండోసారి గెలిచింది.
ఇక దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీలో బీజేపీ గెలుపునకు ప్రధాన కారణం కాంగ్రెస్ లా వారసత్వ రాజకీయాలను చేయకపోవమేనని మోడీ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల యూపీ ఎన్నికల్లో తాను ఎందుకు ఎంపీల వారసులకు టికెట్లు ఇవ్వకుండా పార్టీ కోసం కష్టపడే నేతలు, కార్యకర్తలకు టికెట్లు ఎందుకు ఇచ్చానో మోడీ క్లారిటీ ఇచ్చారు. కేవలం పార్టీ గెలుపు కోసమేనని.. బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవు అని తెలియజేయడానికేనని మోడీ అన్నారు.
ఢిల్లీలో ఈరోజు ఐదు రాష్ట్రాల్లో గెలిచిన సందర్భంగా మోడీకి, జేపీ నడ్డాకు బీజేపీ సీనియర్లు , ఎంపీలు సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించడానికి ప్రధాన కారణం అదొక కుటుంబ పార్టీ అని.. వారసత్వ రాజకీయాలు చేస్తారని.. అందుకే మనం అలాంటి దారిలో నడవకూడదనే పార్టీలో కష్టపడ్డ వారికే టికెట్లు ఇచ్చామని మోడీ అన్నారు.
జాతీయ రాజకీయాలే కాదు.. ప్రాంతీయ పార్టీల్లోనూ అదే వారసత్వ కంపు కొడుతోంది. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకి పలు పదువులు దక్కాయి. కేటీఆర్ సీఎం రేసులో ఉన్నారు. ఇక ఏపీలో తమిళనాడులో స్టాలిన్ ఫ్యామిలీ.. యూపీలో సమాజ్ వాదీ అఖిలేష్ పార్టీ.. శివసేనలో తండ్రీ కొడుకులు సీఎం మంత్రులుగా కొనసాగుతున్నారు. ఎన్సీపీలోనూ అదే కథ.. శరద్ పవార్, ఆయన కూతురు రాజ్యమేలుతున్నారు. వీరే కాదు.. చాలా పార్టీల్లో వారసత్వ రాజకీయాలున్నాయి.
యూపీ నుంచి తమ వారసులకు టికెట్లు కావాలని ఎంతో మంది ఎంపీలు, మంత్రులు, నేతలు ఒత్తిడి తీసుకొచ్చినా.. కేవలం వారసత్వ రాజకీయాలు ప్రోత్సహించవద్దనే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇదే బీజేపీ సక్సెస్ ఫార్ములా..
కాంగ్రెస్ లో సోనియా, రాహుల్, ప్రియాంక తప్పితే మరొకరు లేరు. అదే బీజేపీలో మోడీకి వారసులు లేరు. ఇక వాళ్లు ప్రోత్సహించరు. తెలంగాణలో పార్టీ కోసం కష్టపడిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. ఏపీలోనూ సోము వీర్రాజు లాంటి ఫైర్ బ్రాండ్లకు బాధ్యతలు ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లోనూ వారసత్వ రాజకీయాలకు తావు లేకుండా కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వారికి అందలం దక్కింది. ప్రజల్లో ఆ భరోసా కల్పించారు కాబట్టి విజయం తధ్యమైంది. బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ లాజిక్ మిస్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ చతికిలపడుతోంది. అందుకే వారసత్వ రాజకీయాలకు బీజేపీలో చరమగీతం పాడేసి మోడీ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారని చెప్పొచ్చు.
Also Read: Janasena-TDP Alliance: పవన్ స్పీచ్‌తో టీడీపీలో కొత్త ఆశలు.. వైసీపీలో అలజడి