
భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీ కానున్నారు. అఫ్గనిస్తాన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించనున్నారు. తాలిబన్ల సర్కారుకు పాకిస్తాన్ అందిస్తున్న సాయంపై ప్రధాని మోడీ ఫిర్యాదు చేయనున్నారు. తాలిబన్లకు పాకిస్తాన్ అందిస్తున్న సాయంపై ప్రపంచవ్యాప్తంగా ఏ సంకేతాలు వెళ్తాయో అన్న దానిపై చర్చలు చేసే అవకాశముంది. బైడెన్, మోడీ మధ్య ద్వైపాక్షిక అంశాల్లో భేటీ జరగబోతోంది. బైడెన్ అధ్యక్షుడయ్యాక తొలిసారి మోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్న క్రమంలో ప్రాధాన్యం సంతరించుకుంది.
గతంలో ట్రంప్ హయాంలో మోడీ పలు మార్లు అమెరికా పర్యటనకు వెళ్లినా బైడెన్ అధ్యక్షుడయ్యాక ఇదే తొలి సారి పర్యట. దీంతో వీరిద్దరి భేటీలో కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశాలున్నాయి. తాలిబన్ల ప్రభుత్వానికి పాకిస్తాన్ నుంచి అందుతున్న సాయం గురించి ప్రస్తావించనున్నారు. అఫ్గనిస్తాన్ లో కొలువుదీరిన తాలిబన్ల ప్రభుత్వంలో పాక్ ప్రేరేపిత ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్ కాబుల్ పర్యటన వంటి విషయాన్ని మోడీ బైడెన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కూడా రెండు దేశాలు పరస్పర సహకారం అందించుకోనున్నట్లు తెలుస్తోంది.
తాలిబన్ల సర్కారుతో ఉగ్రవాదం పెరిగిపోతున్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం గురించి ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. తాలిబన్లు హడ్కానీ గ్రూపుతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్న క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా జరగబోయే నష్టం గురించి ప్రస్తావనకు రానుంది. తాలిబన్ల కేబినెట్లో ఉగ్రవాద మూలాలున్న వారిని నియమించడంతో ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అఫ్గన్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఇదు దేశాల మధ్య పలు చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే అఫ్గనిస్తాన్ కు సాయం అందిస్తున్న పాకిస్తాన్ మాత్రం ఎక్కడ కూడా బయటపడడం లేదు. అంతర్గతంగా ఎవరికి తెలియకుండా సాయం చేస్తూ అఫ్గన్ ను తమ గుప్పిట పెట్టుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాలిబన్ల తీరుతో పలు దేశాలకు పొంచి ముప్పు గురించి చర్చకు వచ్చే వీలుంది. పాకిస్తాన్ తాలిబన్ల ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తుందోనన్న సందేహాన్ని వ్యక్తం చేస్తోంది. మొత్తానికి పలు అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.