Modi Hindutva: హిందువుల హృదయ సామ్రాట్ గా నరేంద్ర మోడీ

Modi Hindutva: పాకిస్తాన్ లో హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు, పక్కనున్న బంగ్లాదేశ్ లోనూ అదే పరిస్థితి. ఈరెండు ఫక్తు ముస్లిం దేశాలు. అక్కడ హిందువులు మైనార్టీలు. కానీ భారత్ లో హిందువులు మెజార్టీగా ఉన్నారు.  మెజార్టీ పీపుల్ మైనార్టీలో బతికే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే అన్నఆవేదన ఆగ్రహం ఇక్కడి హిందువుల్లో లో నాటుకుపోయింది. కాంగ్రెస్ సెక్యూలర్ రాజకీయాలతో తమ రెండో తరగతి పౌరులుగా బతుకుతున్నామన్న భావన హిందువుల్లో అనాదిగా ఏర్పడింది. ఈ క్రమంలోనే […]

Written By: NARESH, Updated On : November 5, 2021 9:01 am
Follow us on

Modi Hindutva: పాకిస్తాన్ లో హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు, పక్కనున్న బంగ్లాదేశ్ లోనూ అదే పరిస్థితి. ఈరెండు ఫక్తు ముస్లిం దేశాలు. అక్కడ హిందువులు మైనార్టీలు. కానీ భారత్ లో హిందువులు మెజార్టీగా ఉన్నారు.  మెజార్టీ పీపుల్ మైనార్టీలో బతికే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే అన్నఆవేదన ఆగ్రహం ఇక్కడి హిందువుల్లో లో నాటుకుపోయింది. కాంగ్రెస్ సెక్యూలర్ రాజకీయాలతో తమ రెండో తరగతి పౌరులుగా బతుకుతున్నామన్న భావన హిందువుల్లో అనాదిగా ఏర్పడింది. ఈ క్రమంలోనే తమ ఆశలు తీర్చే వారికి హిందువులు ఆశగా ఎదురుచూశారు. అప్పుడే నరేంద్రమోడీ వచ్చాడు. స్వయంగా ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలం గల మోడీని అందుకే హిందువులు నెత్తిన పెట్టుకున్నారు.  దేశంలో హిందువుల హృదయాలను ప్రధాని నరేంద్రమోడీ గెలుచుకున్నాడు. దేశంలో దాదాపు 80శాతం వరకూ హిందువులున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కానీ హిందువుల్లో 75 ఏళ్ల తర్వాత కూడా మాకు తగిన గుర్తింపు లేదు ఈ దేశంలో అన్న భావన మోడీ రాకముందు చాలా బలంగా ఉంది.

modi hindutva ram talk

అనాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం.. అంతకుముందు 700 సంవత్సరాల ముస్లిం పరిపాలన.. ఆ తర్వాత 200 ఏళ్ల బ్రిటీష్ పరిపాలనలో హిందువులు రెండో తరగతి ప్రజలుగానే చూడబడ్డారు. ఇది చారిత్రక వాస్తవం. దానికి ఇప్పటివారిని నిందించడానికి లేదు. చరిత్రను చరిత్రగానే చూడాలి.

1947లో భారతదేశానికి స్వాంతంత్ర్యం వచ్చాక మెజార్టీ 80శాతం ఉన్న హిందువులు ఆ ఫలాలను అనుభవించాలని చాలా అనుకున్నారు. కానీ ఆ స్వాతంత్ర్యాన్ని హిందువులు అనుభవించలేకపోయారు. రాజకీయంగా స్వాతంత్ర్యాన్ని పొందలేకపోయారు. మతపరంగా.. వాళ్లు వివక్షకు గురవుతున్నారనే భావన వారి లోలోపల ఎక్కువగా ఉండేది.

అనాది కాంగ్రెస్ సెక్యూలర్ పాలనలో ముస్లింలకు పెద్దపీట.. హిందువుల ఆశలు, ఆంకాంక్షలు నెరవేరకపోవడం.. మతాల మధ్య చిచ్చు.. కశ్మీర్ పండింట్లను ఆ రాష్ట్రం నుంచి గెంటివేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. మత కలహాల్లో హిందువులను విలన్లుగా చూపించారన్న ఆవేదన వారిలో ఉంది. రెండు వైపులా తప్పు ఉండొచ్చు. కానీ హిందువులే టార్గెట్ అయ్యారు. హిందువుల మత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువగా ఉండేది. మిగతా మతాల్లో అలా జరగలేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు ఎక్కువైపోయాయి.

ఇవన్నీ కలగలపి హిందువుల్లో ఒకరకమైన భావన ఏర్పడింది. మాకు సరైన గుర్తింపు, న్యాయం జరగడం లేదన్న ఆవేదన ఎక్కువైంది. ఆ భావన పెరిగి పెద్దది అయ్యి.. 2014లో హిందుత్వ మోడీని సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి తీసుకొచ్చింది. అయితే మోడీ ఈ ఒక్క కారణంతోనే అధికారంలోకి రాకపోవచ్చు. కానీ ఇదొక బలమైన కారణం.. ఈ క్రమంలోనే హిందువుల సామ్రాట్ గా నరేంద్రమోడీ ఎలా ఎదిగారు? వారిని ఎలా తమవైపు తిప్పుకున్నాడన్న దానిపై…

‘రామ్ టాక్’ ప్రత్యేక విశ్లేషణ ఈ వీడియోలో చూడొచ్చు.