Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: అమెరికాలో అడ్డంగా బుక్కైన ‘నారా లోకేషం’ బాగోతం..

Nara Lokesh: అమెరికాలో అడ్డంగా బుక్కైన ‘నారా లోకేషం’ బాగోతం..

Nara Lokesh: ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య భీకర యుద్దం నడుస్తొంది. ఏ చిన్నపాటి విషయమైనా ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి, రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం ఎంతగా దుమారం రేపిందో అందరికి తెలిసిందే. వ్యక్తిగతమైనా, సామాజిక సమస్య అయినా రెండు పార్టీల నేతలు ఒకేలా స్పందిస్తున్నారు. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రధానంగా ఇరు పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఒకరికి ఒకరు వ్యతిరేంగా పోస్టులు పెడుతున్నారు. వాటినే ట్రోల్ చేస్తున్నారు. తాజాగా టీడీపీ యువ నేత లోకేష్ ప్రధాన అనుచరుడు పేరిట ఒక ఫోటో వైసీపీ సోషల్ మీడియా విభాగం ట్రోల్ చేసింది. రాష్ట్ర మంత్రి తానేటి వనితకు లోకేష్ అనుచరుడు స్వాగతం పలుకుతున్నారంటూ ఒక ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై వైసీపీ శ్రేణులు హాట్ హాట్ కామెంట్లు పెడుతున్నారు.

Nara Lokesh
Nara Lokesh, minister vanitha

ఏపీ మంత్రి తానేటి వనిత అమెరికాలో పర్యటించారు. తానా సభలకు నిర్వాహకుల ఆహ్వానం మేరకు వెళ్లారు. ఈ పర్యటనలో మంత్రి వనిత ఉత్సాహంగా గడిపారు. సరదాగా గన్ షూట్ చేసిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఫొటోలు, వీడియోలు దర్శనమిచ్చాయి. ఇదిలా ఉంటే మంత్రి అనితకు లోకేష్ ప్రధాన అనుచరుడు ఒకరు స్వాగతం పలికారంటూ ఒక ఫొటోను వైసీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో పెట్టారు. గతంలో లోకేష్ వెళ్లినప్పుడు స్వాగతం పలికిన ఫొటో, ఇప్పుడు మంత్రి అనితకు స్వాగతం పలికన ఫొటోను జతచేసి సోషల్ మీడియాలో పెట్టారు. అంతటితో ఆగకుండా పలురకాల వ్యాఖ్యానాలు చేస్తూ వైసీపీ యాక్టివిస్టులు కామెంట్లు పెడుతున్నారు.

Nara Lokesh
Nara Lokesh

లోకేష్ అనుచరుడు అని చెబుతున్నారు కానీ.. ఆయన పేరు వెల్లడించలేదు. అసలు ఆయన చిరునామా కానీ.. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన వాడని కానీ మెన్షన్ చేయలేదు. కేవలం లోకేష్ అనుచరుడు రాష్ట్ర మంత్రి వనితకు స్వాగతం పలికారని మాత్రమే పేర్కొన్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందనేది మాత్రం తెలియడం లేదు. నేతలు, ప్రజాప్రతినిధుల విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడుండే స్థానికులు స్వాగతం పలకడం కామన్. గతంలో మంత్రి హోదాలో లోకేష్ వెళ్లి ఉంటారని.. అప్పట్లో స్వాగతం పలికిన వ్యక్తి.. ఇప్పటి మంత్రికి స్వాగతం పలకడంలో తప్పేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా అది అమెరికాలో ఉండే తెలుగువారి పండుగ అయినప్పుడు మంత్రికి స్వాగతం పలికితే తప్పు ఎంటని ప్రశ్నించిన వారూ ఉన్నారు. మొత్తానికి ఏపీలో ఏ చిన్న అంశమైనా రాజకీయ కోణం చూడడం జుగుప్సాకరంగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

1 COMMENT

Comments are closed.

Exit mobile version