Ram Gopal Varma: టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమాల్లో శివ కూడా ఒకటి. అప్పట్లో ఈ మూవీ ప్రభంజనం అంతా ఇంతా కాదు. రికార్డులన్నీ బద్దలైపోయాయి. అయితే ఈ మూవీ వెనకాల ఆర్జీవీ ఓ పెద్ద అబద్ధం ఆడాడట. అలా అబద్ధం ఆడితే గానీ ఈ సినిమా తీయలేకపోయాడంట. అలా అబద్ధం ఆడి తీసిన మూవీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది. మరి ఆ అబద్ధం ఏంటనేది చూద్దాం.
రావుగారి ఇల్లు మూవీ తీస్తున్న సమయంలో ఆర్జీవీ ఆ ప్రాజెక్టుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆ టైమ్ లోనే నాగార్జునకు, ఆర్జీవీకి మంచిస్నేహబంధం ఏర్పడింది. ఇంకేముంది ఓ మంచి కథ ఉంటే చెప్పు మూవీ చేద్దాం అంటూ ఆర్జీవీకి ఆఫర్ ఇచ్చాడు నాగార్జున. దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఓ హర్రర్ కథను నాగార్జునకు వినిపించాడు ఆర్జీవీ. కానీ అది నాగార్జునకు పెద్దగా నచ్చలేదు.
Also Read: Amma Rajasekhar: అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన 6 సినిమాల్లో ఎన్ని హిట్టు ? ఎన్ని ప్లాప్ ?
ఇదే కథను ఓ సారి నాగార్జున సోదరుడు వెంకట్‌కు వినిపించగా.. ఇలాంటి స్టోరీలు నాగార్జునకు సెట్ కావని.. ఏదైనా హీరోటిక్ కథ ఉంటే చెప్పమన్నారంట. దీంతో ఆర్జీవీ బ్రూస్ లీ, ఎంటర్ ది డ్రాగన్, హిందీ అర్జున్ మూవీల కథలను ఒకచోట రంగరించి చివరకు శివ కథను రాసుకుని వచ్చాడంట. ఈ కథను నాగార్జునకు వినిపించగా.. పిచ్చిగా నచ్చేసిందంట.
వెంటనే చేద్దాం అంటూ చెప్పారంట. కానీ ఆ మూవీ చేసే సమయానికి వెంకట్‌కు, నాగేశ్వరరావుకు మాటలు లేవు. విడివిడిగా ఈ కథను ఆర్జీవీ వారికి చెప్పగా ఇద్దరికీ నచ్చలేదు. దాంతో తన సినిమా ఆగిపోతుందేమో అన్న భయంతో.. ఇద్దరి దగ్గర అబద్ధం ఆడాడంట.వెంటక్ దగ్గరకు వెళ్లి నాగేశ్వరరావు గారు చేయమన్నారని చెప్పాడు ఆర్జీవీ. అలాగే నాగేశ్వరావు దగ్గరకు వచ్చి వెంకట్ చేయమంటున్నాడని చెప్పాడు. దీంతో ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా అబద్ధం ఆడి తీసిన మూవీ ఇండస్ట్రీ తలరాతను మార్చేసింది.ఒకవేళ ఆ రోజు ఆర్జీవీ అబద్దం చెప్పకపోతే ఇంత మంచి మూవీని టాలీవుడ్ మిస్ చేసుకునేదేమో.
Also Read: Triple Role Heros In Tollywood: సినీ చరిత్రలో త్రిపుల్ రోల్ చేసిన 6 స్టార్లు వీళ్లే