Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: మారిన లోకేష్ లుక్.. ఆయన్ను కాపీ కొట్టారా?

Nara Lokesh: మారిన లోకేష్ లుక్.. ఆయన్ను కాపీ కొట్టారా?

Nara Lokesh : నారా లోకేష్ అనగానే ఎవరి మనసులోనైనా.. బొద్దుగా ఉండే ఆకారం, నున్నటి క్లీన్ షేవ్ ముఖం ప్రత్యక్షమవుతుంది. కానీ.. ఇదంతా గతమనే చెప్పాలి. గడిచిన నాలుగైదు నెలలుగా.. ఆయన లుక్ పూర్తిగా మారిపోయింది. స్లిం గా తయారవడమే కాకుండా.. కాస్త గడ్డం మెయింటెయిన్ చేస్తూ.. రఫ్ లుక్ కంటిన్యూ చేస్తున్నారు. అంతేకాదు.. ప్రసంగంలోనూ.. వాగ్ధాటి పెంచారు. లఓకేష్ కు సంబంధించి ఇవన్నీ హాట్ టాపిక్ గా మారిపోయాయి.
Nara Lokesh
గతంలో లోకేష్ ను అందరూ.. తండ్రిచాటు బిడ్డ‌గానే చూశారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా.. లేవ‌ట్లేదంటూ సోష‌ల్ మీడియాలో ఎన్నో జోకులు పేలేవి. ఇక ఆయనకున్న నిక్ నేమ్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ ట్రోల్స్ తనదాకా వెళ్లడంతో బాగానే కసి పెంచుకున్నట్టు కనిపిస్తోంది. తిండి త‌గ్గించారో.. క‌స‌ర‌త్తులు పెంచారోకానీ.. మొత్తానికి దేహాన్ని క‌రిగించేశారు. స్లిమ్ గా త‌యారైపోయారు. క్లీన్ షేవ్ ప్లేసులో.. గుబురు గ‌డ్డం పెంచడం మొద‌లు పెట్టారు.

ఇదేకాకుండా.. గడిచినకొంత కాలంగా.. లోకేష్ స్పీచ్ చాలా మారింది. జగన్ ను ఢీ అంటే ఢీ అంటున్నారు. కొన్ని అభ్యంతరకరమైన పదాలు కూడా వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా.. అనంతపురంలో విద్యార్థులతో మాట్లాడుతూ.. దున్నపోతు వంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇవన్నీ.. మారిన లోకేష్ ను కళ్ల ముందు పెడుతున్నాయి.

ఇంత మార్పు ఎందుకు వచ్చిందన్నది తెలిసిందే. ఆయనను పప్పు అంటూ ఒక అసమర్థుడు అనే ముద్ర వేసేందుకు చాలా మంది ప్రయత్నించారనే అభిప్రాయం ఉంది. దీన్ని దూరం చేసుకోవడానికి లోకేష్ బాగానే శ్రమించారు. ఇప్పుడు ప్రజా క్షేత్రంలోనూ.. కలియతిరుగుతున్నారు. మాస్ లీడర్ అనిపించుకునేందుకు కృషి చేస్తున్నారు.

Also Read: Harish Rao: హరీష్ కు వైద్యఆరోగ్యశాఖ,, కేసీఆర్ సరికొత్త వ్యూహం అదేనా?

ఇవన్నీ చూసిన వారు.. లోకేష్ సీఎం జగన్ నే ఫాలో అవుతున్నాడని అంటున్నారు. జగన్ కూడా కొంతకాలంగా కాస్త గడ్డం ఉంచుతున్నారు. ఇక, విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన స్పీచ్ ధాటిగానే సాగేది. ఇప్పుడు లోకేష్ కూడా అదేవిధంగా ఎదిగేందుకు చూస్తున్నారని అంటున్నారు. మరి, ఈ మార్పు ఏమేరకు మంచి చేస్తుంది అన్నది చూడాలి.

Also Read: Etela Rajender: ప్రమాణ స్వీకారం చేసి.. తొడగొట్టి మరీ.. కేసీఆర్ కు ఈటల సంచలన సవాల్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular