
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పుడు మహానాడు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.లోకేష్ లాక్ డౌన్ కారణంగా రెండు నెలల పాటు హైదరాబాద్ లో ఇంటికే పరిమితం అయ్యారు. ఇటీవలే హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు. రెండు నెలల తరువాత ఆయనను చూసిన నాయకులు, కార్యకర్తలు అవాక్కయ్యారు. ఎందుకో కాదు..లోకేష్ బాబు స్లిమ్ అయ్యారని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడులో పార్టీ ముఖ్య నాయకులు ఈ అంశంపై చర్చించుకున్నారు. రెండు నెలల్లో 20 కిలోల బరువు తగ్గేనని లోకేష్ చెప్పారంట. బరువు తగ్గడానికి పాటించిన నియమాలను వెల్లడించారు. ఆహార నియమాలతో పాటు వ్యాయామం చెయ్యడం వల్ల ఇంత బరువు తగ్గానని నాయకులకు చెప్పారు.
మరోవైపు సోషల్ మీడియాలోను నారా లోకేష్ బరువు తగ్గిన విషయం వైరల్ అవుతుంది. టీడీపీ ఫాలోవర్స్ లోకేష్ ను మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతుంటే.. వైసీపీ ఫాలోవర్స్ మాత్రం సెటైర్లు గుప్పిస్తున్నారు. బరువు తగ్గితే సరిపోదు, బుర్ర పెరగాలంటూ వైసీపీ కార్యకర్తలు, ఫాలోవర్స్ ఓ ఆట అడ్డుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారుల ట్వీట్లకు విస్తుపోవడం టీడీపీ నాయకుల వంతయ్యింది. రాజకీయమంటే బాడీ షేపింగ్ మాత్రమేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఇటు మహనాడులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా, అటు సోషల్ మీడియాలోను లోకేష్ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.