Nara Lokesh – BJP : అవసరార్థం వాడుకొని వదిలేయడంలో చంద్రబాబు ఏక్ నంబర్ అయితే.. లోకేష్ దో నంబర్ అన్నట్టుగా మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత బీజేపీ కరుణతో బయటపడాలని చంద్రబాబు అండ్ బ్యాచ్ చేయని ప్రయత్నం లేదని టాక్ నడిచింది. పెద్ద ఎత్తున టీడీపీ బ్యాచ్ లాబీయింగ్ చేసిందని ప్రచారం సాగింది. ఎందుకంటే ఈ దేశంలోనే అతిపెద్ద మేనేజ్ మెంట్ వ్యవస్థ చంద్రబాబు సొంతం. అందుకే 45 ఏళ్ల రాజకీయంలో ఆయనపై ఒక్క కేసు కూడా నిలబడలేదు. అయితే ఆరోజులు పోయాయి. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యారు. ఏ వ్యవస్థ పనిచేయలేదు. ఇక ఒకప్పటి తన బీజేపీ మిత్రులైన మోడీ, అమిత్ షాలు ఈ విషయంలో బాబు మొరను ఆలకించలేదు.
చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ కోసం ఢిల్లీలో టీడీపీ బ్యాచ్ చేయని ప్రయత్నం లేదు. లోకేష్, టీడీపీ ఎంపీల కోరిక మేరకు కిషన్ రెడ్డినే అమిత్ షాతో అపాయింట్ మెంట్ ఇప్పించారు. ఆయనతో భేటి నిర్వహించారు. ఇదే అందరికీ తెలిసిన నిజం..
కానీ అమిత్ షా ఏమాత్రం చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదు.. ఖండించలేదని సమాచారం. అందుకే తాజాగా నారా లోకేష్ ప్లేటు ఫిరాయించాడు. తాను అమిత్ షా, మోడీల అపాయింట్ మెంట్ అడగలేదని నాలుక మడతేశాడు. తమ బాబు అరెస్ట్ పై వారు ఏమాత్రం ఆసక్తి చూపించకపోవడంతో నెపాన్ని బీజేపీ పెద్దలపై నెట్టేశాడు లోకేష్.
అయితే తమనే అపాయింట్ మెంట్ అడిగి ఇప్పుడు సాయం చేయలేదని విమర్శిస్తున్న లోకేష్ తీరును స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయటపెట్టాడు. ‘నేను మోడీ, షాలను టైం అడగలేదన్న లోకేష్ కు గట్టి పంచ్ ఇచ్చాడు. ‘చాలా సార్లు చంద్రబాబు కుమారుడు, నారా లోకేష్ హోంమినిస్టర్ అమిత్ షా గారిని కలవాలని అపాయింట్ మెంట్ అడిగారని’ బాంబు పేల్చారు. దీంతో ఈ బీజేపీ, టీడీపీ పరస్పర విరుద్ధ ప్రకటనలు వైరల్ అయ్యాయి. చూస్తుంటే ఈ విషయంలో లోకేష్ దే కాస్త తప్పుగా ఉన్నట్టు ఫోకస్ అవుతోంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫేక్ లెటర్లు ఫేక్ కబుర్లు.. pic.twitter.com/1LaGeuYUgg
— Vikatakavi (@vikatakavi1231) October 24, 2023
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Nara lokesh bjp nara lokesh said he did not ask for amit shahs appointment
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com