Nancy Pelosi Taiwan Visit: చిచ్చుపెట్టిన అమెరికా.. తైవాన్ పై చైనా యుద్ధం చేయబోతుందా?

Nancy Pelosi Taiwan Visit: ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఒక వైపు కొనసాగుతుండగానే అమెరికా మరో యుద్ధానికి తెరలేపుతోంది. తైవాన్ తమ భూభాగమే అని చైనా పదేపదే చెబుతున్నా అమెరికా మాత్రం ఒప్పుకోవడం లేదు. తైవాన్ స్వతంత్ర దేశంగానే పరిగణించాలని చెబుతూ అమెరికా కాంగ్రెస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటించి వివాదానికి తెరలేపింది. దీంతో చైనా యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా స్పీకర్ రాగానే తైవాన్ భూభాగాల్లోకి విమానాలతో చక్కర్లు కొడుతూ చైనా […]

Written By: Srinivas, Updated On : August 3, 2022 1:59 pm
Follow us on

Nancy Pelosi Taiwan Visit: ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఒక వైపు కొనసాగుతుండగానే అమెరికా మరో యుద్ధానికి తెరలేపుతోంది. తైవాన్ తమ భూభాగమే అని చైనా పదేపదే చెబుతున్నా అమెరికా మాత్రం ఒప్పుకోవడం లేదు. తైవాన్ స్వతంత్ర దేశంగానే పరిగణించాలని చెబుతూ అమెరికా కాంగ్రెస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటించి వివాదానికి తెరలేపింది. దీంతో చైనా యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా స్పీకర్ రాగానే తైవాన్ భూభాగాల్లోకి విమానాలతో చక్కర్లు కొడుతూ చైనా కవ్వింపులకు పాల్పడింది.

Nancy Pelosi

చైనా తైవాన్ పై దాడికి పాల్పడితే సహించబోమని అమెరికా చెబుతోంది. తైవాన్ కు రక్షణగా ఉంటామని ప్రకటించింది. దీంతో రెండు అగ్ర రాజ్యాల మధ్య చిచ్చు రేగుతోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తైవాన్ కు తాము అండగా నిలుస్తామని అమెరికా భరోసా ఇస్తున్నా చైనా మాత్రం జీర్ణించుకోలేకపోతోంది. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదని సూచిస్తోంది. దీన్ని అమెరికా పెడచెవిన పెడుతోంది. అవసరమైతే ఎందాక అయినా పోరాటానికి సిద్ధమేనని చెబుతోంది.

Also Read: America- al Qaeda Leader Zawahiri: అమెరికా అన్నంత పని చేసింది

తైవాన్ విషయంలో అమెరికా, చైనా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తైవాన్ తమ భూభాగమే అంటూ చైనా చెబుతుంటే అది స్వతంత్ర దేశమే అని అమెరికా అంటోంది. తమ భూభాగంలోకి అడుగుపెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని డ్రాగన్ హెచ్చరికలను అగ్రరాజ్యం బేఖాతరు చేస్తోంది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరడం చూస్తుంటే ఇక యుద్ధం శరణ్యమే అనే వాదనలు కూడా వస్తున్నాయి. దీనిపై అమెరికా కూడా దేనికైనా రెడీ అంటూ సవాలు విసరడం గమనార్హం.

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ తైవాన్ పర్యటించి రెండు దేశాల మధ్య అగ్గి రాజేసింది. అమెరికా అధ్యక్షుడి తరువాత మూడో స్థానంలో ఉండే నాన్సీ పర్యటన చైనాకు మంట కలిగిస్తోంది. గత 25 ఏళ్లలో అమెరికా అగ్రనేత తైవాన్ లో పర్యటించడం ఇదే తొలిసారి. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. తైవాన్ విషయంలో కలుగజేసుకుంటే యుద్ధం తప్పదని చైనా సన్నాహాల్లో మునిగితేలుతోంది. ఇక ఉపేక్షించేది లేదని రెండు దేశాలు కూడా పరస్పరం దాడికి రెడీ అన్నట్లుగానే ముందుకు సాగడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

Nancy Pelosi

తమ దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి అడ్డు వస్తే ఊరుకునేది లేదని చైనా ఆర్మీ ప్రకటించింది. ఈ మేరకు చైనా యుద్ధ విమానాలు తమ భూభాగంలోకి వచ్చినట్లు తైవాన్ ప్రకటించింది. భయపడాల్సిందేమీ లేదని అమెరికా భరోసా కల్పిస్తోంది. అమెరికా కూడా సముద్ర జలాల్లో నాలుగు యుద్ధ విమానాలను మోహరించినట్లు తెలుస్తోంది. చైనా ఏదైనా కవ్వింపు చర్యలకు దిగితే సరైన సమాధానం చెబుతామని అగ్రరాజ్యం కూడా ప్రకటించడంతో యుద్ధ ప్రభావం వస్తుందేమోననే సందేహాలు వస్తున్నాయి.

ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో శాంతి, సామరస్యం, స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తున్నామని అందులో భాగంగానే తైవాన్ కు మద్దతు ఇస్తున్నట్లు చెబుతోంది. ఈ మేరకు స్పీకర్ నాన్సీ ట్వీట్ చేయడంతో తైవాన్ కు కాస్త బలం వచ్చినట్లు అయింది. అమెరికా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి చేయూత ఇస్తుందని ప్రకటించింది. తైవాన్ విషయంలో ఏ దేశం ఆధిపత్యం కూడా సహించబోమని తేల్చి చెప్పింది. మరోవైపు తైవాన్ కూడా తాము స్వతంత్రంగా ఉంటామని చెప్పడం గమనార్హం.

తైవాన్ పై చైనా యుద్ధానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలోనే అమెరికా కలుగజేసుకుందని తెలుస్తోంది. చిన్న రాజ్యమైనా తాము అండగా నిలుస్తామని అగ్రరాజ్యం ఊతం ఇస్తోంది. చైనా దురాక్రమణకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని అమెరికా అంటోంది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగే అవకాశం మెండుగా ఉన్నట్లు వాతావరణం చూస్తే అర్థమవుతోంది. ఇది ఎందాక వెళ్తుందో తెలియడం లేదు.

Also Read:Congress Focus on Munugodu: మునుగోడు సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ ఫోకస్.. డిఫెన్స్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Tags