Akbaruddin: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసే వ్యాఖ్యలు చాలా సార్లు వివాదాస్పదం అవుతుంటాయి. ముఖ్యంగా మత పరంగా చేసే కామెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి కామెంట్లపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. ఇందులో తొమ్మిదేండ్ల క్రితం నమోదైన కేసు కూడా ఒకటుంది. దానిపై నేడు నాంపల్లి కోర్టు కీలక తీర్పును వెల్లడించింది.

తొమ్మిదేండ్ల కిత్రం అక్బరుద్దీన్ నిజామాబాద్, నిర్మల్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ అప్పట్లో కేసు రిజిస్టర్ అయింది. నిజామాబాద్, నిర్మల్ లో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. అందుకే ఈ చోట ఎన్నికల్లో ఎంఐఎం చాలాసార్లు గెలుస్తూ వస్తుంది. ఇక్కడ ముస్లింలను ప్రభావితం చేసే విధంగా అప్పట్లో అక్బరుద్దీన్ కొన్ని కామెంట్లు చేశారు.
Also Read: బియ్యానికి బదులు డబ్బులు.. ఏపీలో వినూత్న పథకానికి శ్రీకారం?
అయితే వివాదస్పదంగా ఉన్నాయంటూ అప్పట్లో కేసు రిజస్టర్ కావడంతో.. ఆయన 40 రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపారు. ఇక ఈ కేసులో 30 మంది సాక్షులను ప్రశ్నించిన న్యాయస్థానం.. బుధవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అక్బరుద్దీన్ నిర్దోషి అంటూ ప్రకటించింది. అయితే భవిష్యత్ లో మరోసారి ఇలాంటి కామెంట్లు చేయొద్దంటూ అవి దేశ సమగ్రతకు మంచిదికాదని చెప్పింది కోర్టు.
ఇక కేసును కొట్టేసినంత మాత్రానా సంబురాలు చేసుకోవద్దంటూ తెలిపింది. ఈ క్రమంలోనే పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. మరి ఆయన మరోసారి ఇలాంటి కామెంట్లు చేస్తారో.. లేదంటే ఈ దెబ్బతో కాస్తయినా అలాంటి మతపరమైన కామెంట్లు తగ్గించుకుంటారో వేచి చూడాలి.
Also Read: ఏపీ మంత్రి విడుదల రజినీ గురించి ఎవరికీ తెలియని విషయాలివీ!