Munugodu Rajagopal Reddy : మునుగోడు రాజకీయం వివాదాస్పదంగా మారుతోంది. ఇన్నాళ్లు మాటల యుద్ధానికే దిగిన నేతలు ఏకంగా భౌతిక దాడులకు తెగబడటం ప్రజల్లో అసహ్యం కలిగేలా చేస్తోంది. ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు పోటీ చేసే అర్హత ఉంటుంది. కానీ పార్టీల్లో అసహనం పెరిగిపోతోంది. సహనం నశిస్తోంది. ఫలితంది. ఫలితంగా దాడులకు తెగబడుతున్నారు. ఏకంగా నేతలనే టార్గెట్ చేసుకుని దాడులకు దిగడంతో రాజకీయమంటే ఏవగింపు కలుగుతోంది. పరస్పరం దాడులకు దిగడంతో ప్రజల్లో కూడా ఆగ్రహం వస్తోంది. ఇన్నాళ్లు శాంతియుతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భీకరంగా మారుతోంది.

మొన్న కాంగ్రెస్ అభ్యర్థి కాన్వాయ్ పై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో గొడవ రేగింది. దీంతో నేడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేస్తున్న సమయంలో ఓ కాంగ్రెస్ కార్యకర్తపై ఆయనపై చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించడం సంచలనం రేపుతోంది. వ్యక్తులే లక్ష్యంగా దాడులు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికపై నేతల్లో ఎందుకు ఇంత ద్వేషం కలుగుతోంది? అసలు రాజకీయాల ఉద్దేశం ఏమిటి? ఏ విధంగా ప్రచారం చేయాలి? అనే విషయాలపై నేతలకు అవగాహన కరువైందా? లేక విజయంపై భయంతోనే ఇలా చేస్తున్నారా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నక వ్యవహారం కీలక మలుపులు తిరుగుతున్నాయి. నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు ఆందోళనలకు కారణమవుతున్నాయి. పార్టీల మధ్య విద్వేషాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎవరి బలం వారిదే. ఎవరి గెలుపును కూడా ఇంకొకరు అడ్డుకోలేరు. ప్రజాబలం ఉన్న నేతలకు ప్రజలు ఓటు వేస్తుంటారు. నిన్న రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ప్రచారంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త మైక్ లాక్కునే ప్రయత్నం చేయగా అడ్డుకుని అతడిని పోలీసులకు అప్పగించారు.
మునుగోడు కాస్త రణగోడుగా మారుతోంది. నేతల్లో సహనం నశించి దాడులకు పాల్పడుతున్నారు. ఇలాగైతే ప్రజాస్వామ్యానిని విలువ ఎక్కడుంది. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయనే నమ్మకం కూడా పోతోంది. ఈ క్రమంలో నేతలు ఇంత రెచ్చిపోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. ఇంకా ఎన్నిక నిర్వహించే వరకు ఎన్ని గొడవలు చోటుచేసుకుంటాయో అనే అనుమానాలు వస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎవరి ప్రచారం వారు చేసుకుంటున్నా ఇంకా భౌతిక దాడులు ఎందుకు? గెలుపెవరిదనే దానిపై అందరు ఆగ్రహానికి గురవుతున్నారు. భవిష్యత్ లో ఇంకా ఎన్ని దాడులు జరుగుతాయో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.