https://oktelugu.com/

Nagababu Chit Chat: పవన్ సీఎం కాగానే అది గ్యారంటీ.. నాగబాబు వ్యంగ్యాస్త్రలు !

Nagababu Chit Chat: మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్య ఆయన ప్రజల కష్టాల పై చాలా విషయాలు చాలా లోతుగా విశ్లేషిస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన జగన్‌ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రలు సంధిస్తూ.. నెటిజన్లతో ఒక చిట్ చాట్ నడిపారు. ఇన్‌స్టా వేదికగా ఆయన అభిమానులతో మాట్లాడుతూ చాలా విషయాల పై చాలా సరదాగా కామెంట్స్ చేశారు. ఆ విశేషాలు మీకోసం… 1. నాగబాబు సర్‌ మీకు […]

Written By:
  • Shiva
  • , Updated On : April 27, 2022 / 01:52 PM IST
    Follow us on

    Nagababu Chit Chat: మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్య ఆయన ప్రజల కష్టాల పై చాలా విషయాలు చాలా లోతుగా విశ్లేషిస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన జగన్‌ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రలు సంధిస్తూ.. నెటిజన్లతో ఒక చిట్ చాట్ నడిపారు. ఇన్‌స్టా వేదికగా ఆయన అభిమానులతో మాట్లాడుతూ చాలా విషయాల పై చాలా సరదాగా కామెంట్స్ చేశారు. ఆ విశేషాలు మీకోసం…

    Nagababu Chit Chat

    1. నాగబాబు సర్‌ మీకు ఇప్పుడు కానీ, గతంలో కానీ గర్ల్‌ఫ్రెండ్‌ ఉన్నారా?
    నా భార్య.

    2. నాగబాబు సర్‌ కె.ఎ.పాల్‌ గురించి ఒక మాట చెప్పండి.
    తెలీదండి!

    Also Read: Koratala Siva: ఆచార్య ట్రైలర్ ని చూసి మన అందరం మోసపోయినట్టే

    3. అల్లు అర్జున్‌ గురించి ఒక మాట చెప్పండి. ?

    పట్టుదల

    4. మీకు నచ్చిన మీమ్‌ పేజ్‌ ఏమిటి ?

    అన్నీ…

    5. నాగబాబు సర్‌ ఉచిత పథకాల ద్వారా వచ్చే లాభం మీ మాటల్లో…

    భార్య: నాకు వచ్చిన అమ్మఒడి డబ్బులతో మందు తాగుతున్నావ్‌ అది తెలుసుకో నువ్వు!

    భర్త: నేను మందు తాగడం వల్లే నీకు అమ్మ ఒడి డబ్బులు వస్తున్నాయి. అది తెలుసుకో నువ్వు!

    6. గని చిత్రం ఎందుకు సరిగా ఆడలేదంటారు?

    యాక్టింగ్‌ జర్నీలో హిట్స్‌. ఫ్లాప్స్‌ సహజం.

    7. ఏదైనా సినిమాలో విలన్‌గా ట్రై చేయొచ్చు కదా నాగబాబు సర్‌..

    ఎవరైనా అవకాశం ఇవ్వాలిగా.

    8. రీసెంట్‌ మీరు వెళ్లిన వెకేషన్‌ ?

    రాజమహేంద్రవరం

    9. ఈ మధ్యకాలంలో మిమ్మల్ని బాగా నవ్వించిన మీమ్‌.

    ఆంధ్రాలో గ్యాస్‌ సిలెండర్‌ కోసం ఓ మహిళ మంగళసూత్రం, గాజులు తీసి ఇవ్వడం.

    10. ప్రభాస్‌ గురించి మీ మాటల్లో ఒక మాట చెప్పండి.

    డార్లింగ్‌ ఆఫ్‌ టాలీవుడ్‌

    Nagababu Chit Chat

    11. కల్యాణ్‌ దిలీప్‌ సుంకర గురించి మీ అభిప్రాయం ఏమిటి ?

    హార్డ్‌కోర్‌ జనసైనిక్‌.

    12. రానున్న ఎన్నికల్లో జనసేన గెలిస్తే.. ఏ పొజిషన్‌ తీసుకుంటారు?

    పార్టీకి సర్వీస్‌ చేస్తాను,

    13. నాగబాబు సర్‌ ఎబీసీడీ.. జగనన్న కేడీ!

    మీ నిర్ణయాన్ని కాదనడానికి నేనెవర్ని బ్రదర్‌.

    14. జనసేన అధికారంలోకి వస్తే ప్రజల కోసం మీరు చేసే మొదటి పని ఏమిటి ?

    ఆంధ్రప్రదేశ్‌ను రైతు చావులు లేని రాష్ట్రంగా మార్చడం – పవన్‌కల్యాణ్‌

    15. ప్రశాంత్‌ కిశోర్‌ అవసరం జనసేనకు ఉందంటారా?

    మనకు అలాంటి వాళ్లతో అసలు పని లేదు.

    16. నాగబాబు సర్‌ యంగ్‌స్టర్‌కి మీరిచ్చే మోటివేషన్‌?

    కామ్‌గా ఉండండి… జనసేనకు ఓటు వేయండి.

    17. పవన్‌కల్యాణ్‌ సినిమాలో మిమ్మల్ని చూడాలనుంది?

    పవన్‌కి రికమండ్‌ చేయండి.. ప్లీజ్‌!

    18. గిర గిరా తిరుగుతుంది ఫ్యాను అన్నాడు.. అసలు ఫ్యాన్‌ తిరగకుండా పోతుంది రోజురోజుకి ?

    అట్లుంటది వాళ్లతోని..

    19. నాగబాబు సర్‌.. కల్యాణ్‌ మీ తమ్ముడు కాకుండా వేరే వ్యక్తి అయినా మీ సపోర్ట్‌ ఇలాగే ఉంటుందా?

    అతను నా తమ్ముడు కన్నా మనందరికి గొప్ప లీడర్‌.

    20. నాదెండ్ల మనోహర్‌ గురించి మీ అభిప్రాయం ఏమిటి ?

    విజన్‌ ఉన్న లీడర్‌

    21. నాగబాబు సర్‌ మీరు జనసేనలో ఇంకా యాక్టివ్‌ ఉండాలి.. గోదావరి జిల్లాల్లో బాగా యాక్టివ్‌గా ఉండాలి.

    నెక్ట్స్‌ అక్కడికే జెట్‌ స్పీడ్‌తో వస్తా.

    22. ఏపీలో జాబ్‌ క్యాలెండర్‌ ఎప్పుడు వస్తుందో తెలుసా సర్‌?

    ఇప్పుడు చెప్పలేను కానీ 2024లో పవన్‌ సీఎం కాగానే గ్యారెంటీగా వస్తుంది.

    23. త్వరలో ఉత్తరాంధ్రకు వస్తున్నారని సమాచారం. మీ దృష్టికి చాలా విషయాలు తీసుకురావాలి.

    ఎస్‌.. వస్తున్నాను.

    24. మన పౌర క్యాసినో మంత్రి గురించి ఒక్క మాట చెప్పండి?

    మొత్తం నువ్వే చెప్పావ్‌ కదా బ్రదర్‌. నేను చెప్పేది ఏముంది

    25. ఒక మంత్రి పవన్‌కల్యాణ్‌గారు అతనితో ఫొటో దిగారని చెప్పుకుంటున్నాడు.

    అవును బ్రదర్‌… కల్యాణ్‌ కుక్కలు, బర్రెలు, ఆవులు, పందులు ఇలా చాలా జంతువులతో ఫొటోలు దిగుతాడు. కొన్ని జంతువులు చెప్పుకుంటాయి. కొన్ని చెప్పుకోవు అంతే.

    Also Read:Major Movie: ‘మేజర్’ కోసం కొత్త డేట్.. ప్రకటించిన సూపర్ స్టార్ !

    Tags