Nadendla Manohar: వచ్చే ఎన్నికల్లో గట్టిగానే ఫైట్ కు దిగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అన్ని ప్రాంతాల నుంచి బలమైన అభ్యర్థులను రంగంలో దించడం ద్వారా ఓట్లు, సీట్లు కొల్లగొట్టాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా జనసేనలో యాక్టవ్ నాయకులను మూడు ప్రాంతాల నుంచి బరిలో దింపడం ద్వారా పార్టీకి ఊపు తేవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా తాను విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేయాలని చూస్తున్నారు. అప్పుడే పశ్చిమగోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ ఒక ఊపు వస్తుందని.. మెజార్టీ నియోజకవర్గాలు హస్తగతం చేసుకునే అవకాశముందని యోచిస్తున్నారు.

మరోవైపు పార్టీలో యాక్టివ్ రోల్ పాత్ర పోషిస్తున్న నాదేండ్ల మనోహర్ ను ఎంపీగా పోటీచేయించే అవకాశం ఉంది. అదే సమయంలో ఆయన నెల్లూరు జిల్లా కావలి నుంచి బరిలో దింపుతారన్న టాక్ అయితే ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి తిరుగులేని విజయాలు అందించింది. అయితే ఈ సారి వైసీపీ అక్కడ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తుపోసుకుంటున్నారు. గోతులు తవ్వుకుంటున్నారు. అదే సమయంలో అక్కడ జనసేన పుంజుకుంటోంది. అక్కడ టీడీపీ కంటే జనసేనయే బలమైన శక్తిగా మారుతోంది. అధికార పార్టీలో అసమ్మతి నేతలు సైతం జనసేనలోకి దూకుతారన్న ప్రచారం అయితే ఉంది. అయితే ఎన్నికల్లో ఆ జిల్లాలో నాదేండ్ల మనోహర్ ను బరిలో దింపడం ద్వారా పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగించే అవకాశమున్నట్టు జనసేనవర్గాల్లో టాక్ నడుస్తోంది.

కావాలి కాంగ్రెస్ పార్టీకి పట్టున్న నియోజకవర్గం ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టీడీపీ మూడు సార్లు గెలుపొందింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వార్తక, వాణిజ్యంగా ఉన్న కావలి నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు గుండెకాయ లాంటిది. ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థి రంగంలోకి దిగితే మిగతా నియోజకవర్గాలపై ఆ ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. 2014 ఎన్నికల్లో మస్తాన్ రావు టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రయోగం చేశారు. మస్తాన్ రావును పక్కనపెట్టి విష్ణువర్థన్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. కానీ నిరాశే మిగిలింది. ఇక్కడ టీడీపీ బలోపేతం కాకపోవడం ఆ పార్టీకి మైనస్. ఇక్కడ టీడీపీనుంచి మస్తాన్ రావు మరోసారి టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ పార్టీ బలోపేతం కాకపోవడం టీడీపీకి మైనస్ గా మారింది. అందుకే కావాలి నియోజకవర్గాన్ని జనసేనకు వదిలేయ్యాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అందుకే నాదేండ్ల మనోహర్ ను బరిలో దించి.. గెలిపించి.. అటు వైసీపీకి, ఇటు టీడీపీకి గట్టి ఝలక్ ఇవ్వాలని పవన్ చూస్తున్నారు. అయితే దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.