N Taraka Rama Rao: ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వినప్పుడు తనువు పులకిస్తుంది. నేటికీ.. ఎన్టీఆర్ పై అభిమానం పెరుగుతూనే ఉంది అంటే.. అందుకు కారణం ఒక్కటే. ఎన్టీఆర్ సంక్షేమానికి ఆద్యుడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని నినదించిన మహా నేత ఎన్టీఆర్. సామాన్యలను సైతం చట్ట సభల్లో కూర్చోబెట్టిన ఘనత ఎన్టీఆర్ కు మాత్రమే సొంతం. ఎన్టీఆర్ విశిష్టత గురించి, ఆయన ప్రతిష్ట గురించి నేటి తరానికి కూడా తెలియాలి. ఎన్టీఆర్ సాధించిన ఘనతల్లో కొన్ని మీ కోసం.
స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దే.
బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించిన గొప్పతనం కూడా ఎన్టీఆర్ దే.
రెండు రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి, తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మహా నాయకుడు ఎన్టీఆర్.
తెలుగుగంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్ దే.
దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చిన మొట్ట మొదటి నేత కూడా ఎన్టీఆరే.
ఎందరో కొత్తవారిని, బాగా చదువుకున్నవారిని రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటిచేత్తో వారిని గెలిపించిన నిజమైన ప్రజానాయకుడు కూడా ఎన్టీఆరే. నేటి సీఎం కేసీఆర్ నుంచి ఎందరో నేతలకు రాజకీయ జన్మను ఇచ్చింది ఎన్టీఆరే.
“నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్” అంటూ పబ్లిక్ నక్సలైట్లను సమర్థించిన ఏకైక సీఎం కూడా ఎన్టీఆరే.
మొట్ట మొదటి సారిగా రాజకీయాల్లో అన్ని కులముల వారికి ఉన్నత పదవులు కల్పించిన ఏకైక రాజకీయ నాయకుడు కూడా ఎన్టీఆరే. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారికి తన తెలుగుదేశం పార్టీలో కీలక పోస్టులు ఇచ్చారు. అలాంటి వ్యక్తి పై నేడు కుల ముద్ర వేయడం బాధాకరమైన విషయం.
అప్పట్లో తెలంగాణలో బడుగు బలహీనవర్గాలను పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థ ని రద్దు చేసి ఆరాధ్యదైవం అయ్యారు ఎన్టీఆర్. నిజానికి ‘పటేల్ పట్వారీ వ్యవస్థ’ను రద్దు చేస్తే ఓడిపోతాం అని ఎన్టీఆర్ తెలుసు. అయినప్పటికీ బడుగు బలహీన వర్గాల మేలు కోసం తన ఓటమిని సైతం ఎన్టీఆర్ లెక్క చేయలేదు. దటీజ్ ఎన్టీఆర్.
Also Read: RCB loses IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో ఆర్సీబీ ఓటమి.. రన్ మిషన్ కోహ్లీపై ట్రోల్స్
ఎన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘రాముడు – భీముడు”
కర్టుడిగా కృష్ణుడిగా, దుర్యోధనుడిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ. దీనికి ఆయనే నిర్మాత, దర్శకుడు, కాస్ట్యూమ్ డిజైనర్ కూడా.
అలాగే, ఒకే సినిమాలో బృహన్నల, కృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, అర్జునుడి పాత్రల్లో నట విశ్వరూపాన్ని చూపించారు.
ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామ కల్యాణం’లో రావణుడిగా కనిపించి ప్రతినాయకుడిగానూ తనకు తిరుగులేదని పేరు తెచ్చుకున్నారు.
ముఖ్యమంత్రిగా ఉంటూనే కథానాయకుడిగా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో నటించారు. ఏది ఏమైనా పేదల పెన్నిధి.. సంక్షేమానికి
సారధి.. దటీజ్ ఎన్టీఆర్. ది గ్రేట్ ఎన్టీఆర్.