https://oktelugu.com/

Supreme Court Commented Prostitution Is Occupation: వాళ్లూ మనుషులే… వారు చేసేది ఒక వృత్తే!! ఎందుకు వేధిస్తున్నారు!?

Supreme Court Commented Prostitution Is Occupation: సెక్స్‌ వర్క్‌ కూడా ఓ ‘వృత్తి‘ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యభిచారం అనేది వృత్తి అని, చట్ట ప్రకారం సెక్స్‌ వర్కర్లు కూడా గౌరవం, సమాన రక్షణకు అర్హులని తెలిపింది. స్వచ్ఛంద వ్యభిచారం(కన్సెంటింగ్‌ సెక్స్‌) నేరం కాదం కాదని, సెక్స్‌ వర్కర్ల జోలికి పోలీసులు వెల్లొద్దని, క్రిమినల్‌ చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. స్వచ్చంద వ్యభిచారం నేరం కాదని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ఆధారంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : May 28, 2022 / 01:44 PM IST
    Follow us on

    Supreme Court Commented Prostitution Is Occupation: సెక్స్‌ వర్క్‌ కూడా ఓ ‘వృత్తి‘ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యభిచారం అనేది వృత్తి అని, చట్ట ప్రకారం సెక్స్‌ వర్కర్లు కూడా గౌరవం, సమాన రక్షణకు అర్హులని తెలిపింది. స్వచ్ఛంద వ్యభిచారం(కన్సెంటింగ్‌ సెక్స్‌) నేరం కాదం కాదని, సెక్స్‌ వర్కర్ల జోలికి పోలీసులు వెల్లొద్దని, క్రిమినల్‌ చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. స్వచ్చంద వ్యభిచారం నేరం కాదని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ఆధారంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. సెక్స్‌ వర్కర్లకు సంబంధించి నియమించిన కమిటీ ఇచ్చిన కీలక సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించింది. సెక్స్‌ వర్కర్లకు సంబంధించి సిఫార్సులపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని సుప్రీం ఆదేశాల్లో పేర్కొంది.

    Prostitution Is Not Illegal

    2016లో వ్యాజ్యం..

    సెక్స్‌వర్కర్లపై వేధింపుల గురించి 2016లో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌.గావై, జస్టిస్‌ ఎఎస్‌.బోపన్నతో కూడిన ధర్మాసనం గత గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్యానెల్‌ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.

    – సెక్స్‌ వర్కర్లను గౌరవంగా చూడాలని, వారిని వేధించడం, దూషించడం గానీ, భౌతికంగా గానీ సెక్స్‌వర్కర్ల మీద దాడి చేసే హక్కు గానీ పోలీసులకు ఉండబోదని కోర్టు పేర్కొంది. వారి అంగీకారంతోనే ఆ వృత్తి కొనసాగుతుంటే ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని సూచించింది.

    – రాజ్యాంగంలో ఆర్టికల్‌ 21కి అనుగుణంగా దేశంలోని ప్రతి పౌరుడికి గౌరవంతో జీవించే హక్కు ఉందని బెంచ్‌ అభిప్రాయపడింది. ఈ మేరకు సెక్స్‌ వర్కర్లను వేధించకూడదని, వారిని అరెస్ట్‌ చేయకూడదని పేర్కొంది. ఆ వృత్తిలో ఉన్నదనే ఏకైక కారణంతో సెక్స్‌ వర్కర్‌ పిల్లలను తల్లి నుంచి వేరుచేయరాదని ఆదేశించింది. సెక్స్‌ వర్కర్లపై వివక్ష చూపించరాదని స్పష్టం చేసింది.

    – సెక్స్‌ వర్కర్ల పట్ల పోలీసుల వైఖరి తరచుగా క్రూరంగా, హింసాత్మకంగా ఉంటుందని గమనించామని, తమ హక్కులకు గుర్తింపు లభించనివర్గం వారు అని సుప్రీంకోర్టు తెలిపింది.

    – వ్యభిచార గృహాలపై దాడులు జరిపిన సమయంలో పట్టుబడిన సెక్స్‌ వర్కర్ల ఫొటోలను ఎట్టిపరిస్థితుల్లోనూ మీడియా టెలిక్యాస్ట్‌ చేయరాదని తెలిపింది.

    – అరెస్టులు, దాడులు, రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో బాధితులుగా లేదా నిందితులుగా ఉన్న సెక్స్‌ వర్కర్ల గుర్తింపును బహిర్గతం చేయకుండా మీడియా జాగ్రత్తలు తీసుకోవాలని, దీనికోసం ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తగిన మార్గదర్శకాలను విడుదల చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

    – ఏ మీడియా లేదా పబ్లిషర్లు వారి ఫొటోలు ప్రచురించినా గుర్తింపును వెల్లడించినా ఐపీసీ 354సీ ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

    – లైంగిక వేధింపుల నుంచి బయటపడిన సెక్స్‌ వర్కర్లకు చట్టానికి అనుగుణంగా తక్షణ వైద్య సహాయంతోపాటు అన్ని సౌకర్యాలను అందించాలని పేర్కొంది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధించిన వయోజన మహిళల కేసులను సమీక్షించి, వారిని గడువులోగా విడుదల చేసేందుకు వీలుగా షెల్టర్‌ హోమ్‌ల సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది.

    Also Read: Clean Chit To Aryan Khan: డ్రగ్స్ ఉచ్చులో అంత మునిగాక ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ నా?

    – మరోవైపు,సెక్స్‌వర్కర్లకు ఆధార్‌ కార్డులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి ఒక్కరికి సమానంగా, గౌరవంగా బతికే హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.

    – ఆధార్‌ కార్డుల జారీ సమయంలో సెక్స్‌ వర్కర్ల గోప్యతను ఉల్లంఘించకూడదని, వారి గుర్తింపును బహిర్గతం చేయకూడదని తెలిపింది.

    – జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (ఎన్‌ఏసీవో)లోని గెజిటెడ్‌ అధికారి లేదా రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్ర సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ సమర్పించే ఎన్‌రోల్‌మెంట్‌ ఫారం ఆధారంగా యుఐడీఏఐ జారీ చేసే ప్రొఫార్మా సర్టిఫికెట్‌ ఆధారంగా సెక్స్‌ వర్కర్లకు ఆధార్‌ కార్డులివ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

    – ఆధార్‌ కార్డులు ఇచ్చేందుకు సెక్స్‌ వర్కర్లను ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అడగాల్సిన అవసరం లేదని, ఎలాంటి పత్రాలు లేకున్నా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆధార్‌ కార్డులు తప్పనిసరిగా జారీ చేయాలని, వాళ్లకు రేషన్‌ అందేలా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

    Also Read: NTR Jayanthi: తెలుగులో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి హీరో ఎవరో తెలుసా?
    Recommended Videos:

    Tags