Somnath temple Baan Stambh: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రముఖ పత్రికల్లో ప్రచురితం చేసిన వ్యాసంలో గుజరాత్లోని సోమనాథ ఆలయాన్ని ప్రస్తావించారు. 1026లో మహ్మద్ ఘజనవీ దాడిచేసి శివలింగాన్ని కూల్చివేసిన ఈ క్షేత్రం దేశ చరిత్రలో ఒక నిర్ణయాత్మక ఘట్టం. 2026లో ఈ వ్యాసం రాయడం ప్రత్యేకమైనది, ఎందుకంటే దాడికి వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యాయి. లక్షలాది భక్తులు సంవత్సరమంతా ఇక్కడికి దర్శనం చేస్తూ దివ్య శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చేస్తారు. ఆలయ శిల్పకళా సౌందర్యం అందరినీ ముగ్ధులను చేస్తుంది.
బాణ స్తంభం ఆకర్షణ
ఆలయ పరిసరాల్లో భక్తులు ఫొటోలు తీసుకుంటూ, శిథిలావశేషాలు చూస్తూ మునిగిపోతారు. కానీ చాలామంది మర్చిపోయే ఒక చిన్న అద్భుతం ఉంది అదే బాణ స్తంభం. ఇది భారత నౌకాయాన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. సాధారణంగా ఇంగ్లి్లష్ వాళ్లు భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నారని, వారే నావికా కళను బోధించారనే భ్రమలు ఉన్నాయి. కానీ మన ప్రాచీన వారసత్వంలో అధునాతన నౌకాయాన వ్యవస్థ ఉంది, దానికి బాణ స్తంభం ప్రధాన రుజువు.
ఆరో శతాబ్దంలోనే ఆవిష్కరణ..
ఈ స్తంభం మీద భూమి గోళం ఉంటుంది, దానిపై బాణం అరేబియా సముద్రం వైపు నైరుతి దిశలో చూపిస్తుంది. శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఇది ఆరో శతాబ్దం నాటిది. తర్వాతి గ్రంథాల్లో దీని ప్రస్తావన కనిపిస్తుంది. ఆ కాలంలో భూమి గుండ్రని అర్థం చేసుకుని, గోళ ఆకారాన్ని స్తంభంపై చెక్కించారు. బాణం దాని ద్వారా సూచించే మార్గం సముద్రాన్ని దాటి దక్షిణ ద్రువం వరకు వెళ్తుంది. సుమారు 10,000 కిలోమీటర్ల దూరంలో అంటార్కిటికా చేరుకుంటుంది, అక్కడ మొత్తం మహాసాగ్రం కనిపిస్తుంది. ఇది ఆరో శతాబ్దంలోనే భారతీయులు సౌత్ పోల్ గురించి తెలుసుకున్నారు. సముద్ర ప్రయాణాలు చేశారని నిరూపిస్తుంది. ప్రాచీన రుషులు, విధ్వాంసులు భూమి ఆకృతి గురించి అధికారిక జ్ఞానం కలిగి ఉండటానికి ఇది స్పష్ట ప్రమాణం.
నావికా వారసత్వానికి స్థిర స్మారకం
సోమనాథ ఆలయం సమీపంలో మూడు నదులు కలిసి అరేబియా సముద్రంలో పోతాయి. ఈ ప్రదేశం భారత నౌకాయాన గొప్పతనానికి సాక్ష్యం. బాణ స్తంభం భూత ఆవిష్కరణలను గుర్తు చేస్తూ నిలబడి ఉంది. మందిర పునర్నిర్మాణం చేసిన ఆధునిక తరాలు దీనిని స్పర్శించి, గౌరవించాలి. ఇది మన సముద్రిక విజ్ఞానం, చరిత్రా గొప్పలకు శాశ్వత చిహ్నం.