Homeజాతీయ వార్తలుSantiago Martin: మయన్మార్ లో కూలీ.. తమిళనాడు ఎన్నికల్లో మూడు సీట్లు..

Santiago Martin: మయన్మార్ లో కూలీ.. తమిళనాడు ఎన్నికల్లో మూడు సీట్లు..

Santiago Martin: ఈసారి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ తర్వాత స్థాయిలో మీడియాను ఆకర్షించిన వ్యక్తి పేరు శాంటియాగో మార్టిన్. ఇతడేమీ మామూలు వ్యక్తి కాదు. అన్ని రాజకీయ పార్టీలకు కావలసిన వాడు. భారీగా డబ్బున్నవాడు. అంతకుమించి పలుకుబడి ఉన్నవాడు. ఈ స్థాయి వ్యక్తిని మయన్మార్ లో కూలి అని ఎలా ప్రస్తావించారని.. మీకు అనుమానం రావచ్చు. దాని నివృతి కోసం ఈ స్టోరీ చదివేయండి.

లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కుటుంబం నుంచి ఈసారి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మార్టిన్ సతీమణి లీమారోస్ లాల్ గుడి నియోజకవర్గం నుంచి అన్న డీఎంకే తరఫున పోటీ చేసి గెలిచారు. ఈమె అన్న డీఎంకే పార్టీకి మహిళా విభాగ సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మార్టిన్ అల్లుడు అధవ్ అర్జున టీవీకే కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఇతడు విక్కీ వక్కం తాళం నుంచి విజయం సాధించారు. మార్టిన్ కుమారుడు చార్లెస్ పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక్కడ కామరాజు నగర్ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన లాచీయ జననాయక కట్చి పార్టీ తరఫున పోటీ చేశారు.

మార్టిన్ ఇప్పుడంటే ఆగర్భ శ్రీమంతుడు. కానీ ఒకప్పుడు ఆయన మయన్మార్లో కూలి. 1988లో మన దేశానికి తిరిగి వచ్చాడు. తమిళనాడు రాష్ట్రంలో లాటరీ వ్యాపారం ప్రారంభించాడు. ఆ తర్వాత దానిని కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు విస్తరించాడు. ఆ తర్వాత ఈశాన్య భారతదేశం వెళ్లిపోయాడు. అక్కడ ప్రభుత్వాలతో కలిసి లాటరీ స్కీమ్ లు నిర్వహించాడు. భూటాన్, నేపాల్ ప్రాంతాలలో కూడా ఈ వ్యాపారాలు సాగించాడు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, టెక్స్టైల్, హాస్పిటాలిటీ రంగాల్లోకి ప్రవేశించాడు. ఈయన ఆధ్వర్యంలో ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొనసాగుతోంది. దీనికి వరల్డ్ లాటరీ అసోసియేషన్ లో మెంబర్షిప్ ఉంది. క్యాసినో, ఆన్లైన్ గేమింగ్ వంటి వాటిని ఇది నిర్వహిస్తూ ఉంటుంది.

మార్టిన్ లాటరీ స్కీమ్ లతో వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అయితే అందులో మోసాలకు పాల్పడ్డాడు. వేలకోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. నీతో కేంద్ర దర్యాప్తు సంస్థలు అతని కార్యాల మీద దాడులు చేశాయి. ఈ సంస్థ నుంచి వచ్చిన ఆదాయంతో మార్టిన్ కోట్లు ఖర్చుపెట్టి ఆయా రాజకీయ పార్టీల బాండ్లు కొనుగోలు చేశారు. 2019, 24 కాలంలో అనేక రాజకీయ పార్టీలకు ఈయన విరాళాలు ఇచ్చాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
Oktelugu Epaper
Exit mobile version