Elon Musk: ఇండియాలో ఎక్స్‌ యూజర్లకు షాక్‌ ఇచ్చిన మస్క్‌.. భారత పర్యటన వేళ ట్విస్ట్‌!

ఫిబ్రవరి 26 నుంచి ఎక్స్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలపై దృష్టిపెట్టింది. మార్చి 25 వరకు భారతీయ సైబర్‌స్పేస్‌లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసినందుకు 1,235 ఎక్స్‌ ఖాతాలను తొలగించినట్లు వెల్లడించింది.

Written By: Raj Shekar, Updated On : April 14, 2024 1:26 pm

Elon Musk

Follow us on

Elon Musk: ప్రపంచంలో అతిపెద్ద సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో ఒకటైన ఎక్స్‌ కార్ప్‌(ట్విట్టర్‌) 2 లక్షలకు పైగా భారతీయులకు షాక్‌ ఇచ్చింది. ప్లాట్‌ ఫాం అధినేత, టెస్లా సీఈవో అయిన ఎలాన్‌ మస్క్‌ భారత్‌ పర్యటనకు రానున్న నేపథ్యంలో పిల్లలపై లైంగిక దాడులు, అశ్లీలతను, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్‌ కట్టడికి ఎక్స్‌ చర్యలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన 2,12,627 ఎక్స్‌ ఖాతాలను నెల వ్యవధిలో నిషేధించింది.

ఉగ్రవాదాన్ని ప్రచారం చేసినందుకు..
ఫిబ్రవరి 26 నుంచి ఎక్స్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలపై దృష్టిపెట్టింది. మార్చి 25 వరకు భారతీయ సైబర్‌స్పేస్‌లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసినందుకు 1,235 ఎక్స్‌ ఖాతాలను తొలగించినట్లు వెల్లడించింది. 2021 కొత్త ఐటీ నిబంధనలకు కట్టుబడి ఎక్స్‌ కార్ప్‌ తన నెలవారీ నివేదికలో ఈమేరకు తెలిపింది. మొత్తంగా ఈ రిపోర్టింగ్‌ ద్వారా దేశవ్యాప్తంగా 2,13,862 ఖాతాలపై నిషేధం విధించినట్లు ఎక్స్‌ స్పష్టం చేసింది.

5,158 ఫిర్యాదులు..
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 వరకు భారతీయ ఎక్స్‌ వినియోగదారుల నుంచి 5,158 ఫిర్యాదులు అందినట్లు ఎక్స్‌ కార్ప్‌ తెలిపింది. తమ గ్రీవెన్స్‌ రెడ్రెసల్‌ మెకానిజం ద్వారా వీటిని కంపెనీ పరిష్కరించింది. అంతేకాకుండా, ఖాతా సస్పెన్షన్‌లకు వ్యతిరేకంగా అప్పీళ్లకు సంబంధించిన 86 ఫిర్యాదులను కంపెనీ ప్రాసెస్‌ చేసింది.