Munugodu By-poll Chapati roller మునుగోడు బైపోల్.. ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరుగుతోంది. ఇరు పార్టీల మధ్య లీడ్ దోబూచులాడుతోంది. దీంతో రెండు పార్టీలో టెన్షన్ పెరుగుతోంది. అభ్యర్థుల్లో అయితే నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే.. టీఆర్‌ఎస్ పార్టీ మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేసినట్లు.. ఈసారి కూడా చపాతీ రోలర్ గుర్తు టీఆర్‌ఎస్ కొంప ముంచేలా కనిపిస్తోంది.

తక్కువ ఆధిక్యంతో ఆందోళన..
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో.. టీఆర్‌ఎస్, బీజేïపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ నుంచి 4వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యే వరకూ.. ఆధిక్యం ఒకసారి టీఆర్‌ఎస్‌వైపు.. మరోసారి బీజేపీవైపు మొగ్గు చూపుతోంది. దీంతో రౌండ్ రౌండ్‌కూ చపాతీ రోలర్ గుర్తుకు పోల్ అవుతున్న ఓట్లు.. కీలకంగా మారుతున్నాయి.
పోస్టల్ ఓట్ల కౌంటింగ్ నుంచే నువ్వా నేనా..
ఉదయం 8 గంటలకు మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించారు. ఇందులే టీఆర్‌ఎస్ బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు కేవలం నాలుగు ఓట్ల ఆధిక్యం మాత్రమే వచ్చింది.
తొలిరౌండ్‌లో టీఆర్‌స్ ఆధిక్యం..
బైపోల్ కౌంటింగ్‌లో తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం సాధించింది. బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. టీఆర్‌ఎస్‌కు 1300 ఓట్ల మెజారిటీ సాధించింది. తొలిరౌండ్ కౌంటింగ్ పూర్తిగా గ్రామీణ ఓట్లు కావడంతో తొలిరౌండ్‌ల బీజేపీ వెనుకబడిందన్న అబిప్రాయం వ్యక్తమవుతోంది.
రెండో రౌండ్ నుంచి బీజేపీ..
మునుగోడ ఉప ఎన్నికల లెక్కింపులో రెండో రౌండ్ నుంచి టీఆర్‌ఎస్ వెనుకబడింది. ఇక్కడి నుంచి బీజేపీ పుంజుకుంది. 2, 3, 4వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ స్వల్ప మెజారీటీ సాధించారు. మూడు రౌండ్లలోనూ బీజేపీ ఆధిక్యం కనబర్చింది. అయితే మెజారిటీ తేడా మాత్రం అత్యంత స్వల్పంగా ఉంది. దీంతో ఇరు పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంటుంది.
చపాతీ రోలర్, రోడ్డు రోలర్ కీలకం..
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయాన్ని చపాతీ రోలర్, రోడ్డు రోలర్ అడ్డుకునే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే మొదటి రౌండ్‌లో చపాతీ రోలర్‌కు 134 ఓట్లు పోలయ్యాయి. రోడ్డు రోలర్‌కు కూడా రౌండ్ రౌండ్‌కు పదుల సంఖ్యలో ఓట్లు పోలవుతున్నాయి. 15 రౌండ్లకు వచ్చే సరికి ఈ రెండు గుర్తులకు పోలయ్యే ఓట్లు.. 3 నుంచి 5 వేల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే టీఆర్‌ఎస్ గెలుపుపై తీవ్ర ప్రభావం ఉంటుందన్న అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు..