KA Paul- Munugode By Election: మునుగోడులో రాజకీయ ప్రచారాలు ముమ్మరం అయ్యాయి. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్ బరిలో నిలిచారు. మునుగోడులో అభివృద్ధి తనతోనే సాధ్యమని కేఏ పాల్ చెబుతున్నారు. వన్ సైడ్ పోలింగ్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ రోజుకో వేషంలో ప్రజలను అలరిస్తున్నారు.

నేడు రైతులతో మాట్లాడుతూ తాను కూడా ఓ రైతుగా మారారు. రైతు సమస్యలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రజాశాంతి పార్టీతోనే అన్ని పనులు జరుగుతాయని ఆశాభావం వ్య్తక్తం చేశారు. మునుగోడులో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. యువతకు ఉద్యోగాలు మాతోనే సాధ్యం. ఎన్నికల ప్రచారంలో తగ్గేదేలే అంటూ ప్రధాన అభ్యర్థులతో పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీలు కేవలం ప్రలోభాలకే పెద్దపీట వేస్తున్నాయని మండిపడుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చిందులేశారు. కాబోయే సీఎం తానేనంటూ స్టెప్పులేశారు. రైతు వేష ధారణలో అందరిని ఆకట్టుకున్నారు. రైతులతో కలిసి ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తనకు ఎదురైన ఇతర పార్టీల అభ్యర్థులను సైతం తనకు ఓటు వేయాలని కోరుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.

మునుగోడు ఉప ఎన్నిక ప్రస్తుతం సీరియస్ గా మారుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మునుగోడులో తమ జెండా ఎగురవేయాలని మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వ్యూహాత్మకంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. మునుగోడును దత్తత తీసుకుంటున్నట్లు టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ప్రకటించగా బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. ఇప్పుడు మునుగోడు దత్తత గుర్తుకొచ్చిందా? ఇన్నాళ్లు ఏమైంది అంటూ బీజేపీ వాటిపై విరుచుకుపడుతోంది. మునుగోడులో గెలిచేదెవరు? నిలిచేదెవరు? త్వరలో తేలనుంది.