Good-bye Kaali-Peeli: ముంబైలో చెదిరిపోతున్న జ్ఞాపకం.. కాళీ పీలీ టాక్సీలకు ఇక సెలవు.. అసలేంటివి.. ప్రత్యేకత ఏంటంటే

నల్లగా, పసుపుపచ్చ కలర్ లో ఉండే టాక్సీలు ఇప్పటికీ సినిమాల్లో కనిపిస్తుంటాయి. అంతే కాదు ముంబై నగరానికి వెళితే అక్కడ కాస్త డిఫరెంట్ లుక్ లో ఇవి కనిపిస్తుంటాయి.

Written By: Neelambaram, Updated On : October 30, 2023 4:08 pm
Follow us on

Good-bye Kaali-Peeli: ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు వెళ్లాలంటే మన వద్ద వాహనాలు ఉండాలి. లేదా బస్ లు, క్యాబ్ లను ఉపయోగించాల్సిందే. కానీ ముంబైలో అయితే కాళీ పీలీ అనే టాక్సీలు చాలా ఫేమస్. ఈ టాక్సీ ల్లోనే ప్రజలు ఎక్కువగా ప్రయాణించేవారు. కానీ ప్రస్తుతం వాటి సేవలకు వీడ్కోలు పలికే సమయం వచ్చింది. ఈ ఐకానిక్ పద్మిని టాక్సీలు ఆరు దశాబ్దాల పాటు సేవలను అందించి ప్రస్తుతం గుడ్ బాయ్ చెప్పబోతున్నాయి.

నల్లగా, పసుపుపచ్చ కలర్ లో ఉండే టాక్సీలు ఇప్పటికీ సినిమాల్లో కనిపిస్తుంటాయి. అంతే కాదు ముంబై నగరానికి వెళితే అక్కడ కాస్త డిఫరెంట్ లుక్ లో ఇవి కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు అవి కనిపించవట. ముంబై పట్టణంలో అంతర్భాగం అయినా ఈ టాక్సీలు త్వరలోనే వాటి సేవలకు స్వస్తి చెప్పనున్నాయి. అయితే నగరంలో ఈ క్యాబ్‌ల వయస్సు పరిమితి కారణంగా వారి ప్రయాణం ముగుస్తుంది. కేవలం వీటికి 20 సంవత్సరాల పర్మిషన్ మాత్రమే ఉందట. అంటే ఇచ్చిన గడుపు పూర్తి అవడంతో ఈ రోజు నుంచి వీటి సేవలు పూర్తిగా రద్దు అవుతున్నాయి. అంటే ఈ నోస్టాల్జిక్ టాక్సీలు ముంబై లో సందడి చేయడానికి రోడ్ల మీదికి రావన్నమాట.

అయితే ఒకప్పుడు ముంబైలో అత్యంత ప్రజాదరణ పొందిన రవాణా వ్యవస్థ ఈ ఇండో ఇటాలియన్ టాక్సీ సంస్థ. ప్రస్తుతం 50 కంటే తక్కువ టాక్సీలే వీధుల్లో తిరుగుతున్నా.. నేటితో వాటి గడువు పూర్తిగా తీరడంతో మొత్తంగా ఇక ఈ టాక్సీలు కనిపించవు. అయితే ఈ క్యాబ్ ల సర్వీసులు ఇకపై ఉండవు అని తెలిసిన ప్రయాణికులు.. ఈ సంస్థ అందించిన సేవలను, జ్ఞాపకాలు, ప్రయాణాలను గుర్తు చేసుకుంటూ బాధ పడుతున్నారట. ఒక్కసారిగా ఈ విషయం తెలిసి ఇకపై మాకు సేవలు అందించే టాక్సీలు మారనున్నాయా అంటూ దిగులు చెందుతున్నారు. ఎక్కువగా ఆఫీసులకు, లేదా ఇతర పనులకోసం నిత్యం వీటి సేవలను అందుకునే ప్రయాణికులు అయితే మరింత బాధ పడుతున్నారని టాక్.