Mumbai BMC Election Results: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు డబుల్ షాక్ ఇచ్చాయి. ఒకవైపు అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఆధిక్యం కనబర్చింది. ఇక అధికార బీజేపీ దెబ్బ కాంగ్రెస్‌కు మరింత గట్టిగానే తాకింది. ఎంఐఎం 29 కార్పొరేషన్లలో 13లో 95 స్థానాలు సాధించి ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో బలపడింది. ఇక బీజేపీ ఏకంగా 25 కార్పొరేషన్లను కైవలసం చేసుకుంది.
ఎంఐఎం సీట్లు ఇలా..
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో 95 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం శంభాజీనగర్ (24 సీట్లు), మలేగావ్ (20)లో స్పష్టమైన ఆధిపత్యం చాటుకుంది. బృహణ్ ముంబైలో 8 సీట్లతో ప్రభావం పెంచుకుంది. సోలాపూర్, ధూలే, నాందేడ్‌లో 8 చొప్పున, అమరావతి (6), థానే (5), నాగపూర్ (4), చంద్రపూర్ (1)లో విజయాలు రాష్ట్రవ్యాప్త విస్తరణకు సంకేతం.
మహాయుతి మ్యాజిక్..
బీజేపీ, శివసేన, ఎన్‌సీపీ మహాయుతి కూటమి 29 కార్పొరేషన్లలో 25 కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్త 2,869 వార్డుల్లో బీజేపీ (1,440), శివసేన (404), ఎన్‌సీపీ (164) ఘనవిజయం. బీఎంసీలో బీజేపీ 88 సీట్లతో అతిపెద్ద పార్టీగా మారి, 25 ఏళ్ల శివసేన ఆధిపత్యానికి చెక్ పెట్టింది. ప్రధాని మోదీ ఈ విజయాన్ని కేంద్ర పాలనకు మద్దతుగా పేర్కొన్నారు.
పడిపోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంక్..
సంప్రదాయకంగా కాంగ్రెస్, ఎన్‌సీపీ వైపు మొగ్గు చూపే మైనారిటీ ఓట్లు ఇప్పుడు మజ్లిస్ వైపు తిరిగాయి. ఇది లౌకిక పార్టీలకు పెద్ద గండం. మజ్లిస్ కేడర్ బలోపేతం, స్థానిక సమస్యలపై దృష్టి వల్ల ఈ మార్పు జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్‌మేకర్ పాత్రకు సిద్ధమవుతోందని విశ్లేషకులు అంచనా.
ఓట్ల చీలికలతో డబుల్ లాస్
కాంగ్రెస్‌కు 318 సీట్లు మాత్రమే వచ్చాయి. మజ్లిస్ ఓట్లు తీసుకెళ్లడంతో ముఖ్య ప్రాంతాల్లో బలహీనపడింది. మహాయుతికి మజ్లిస్ ఓటు చీలికలు పరోక్ష లాభం తెచ్చాయి. ఎన్‌సీపీ(ఎస్‌పీ) 36, ఎమ్‌ఎన్‌ఎస్ 14 సీట్లతో పోటీలో వెనుకబడ్డాయి.
షాకింగ్ విజయాలు..
గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడు శ్రీకాంత్ పంగార్కర్ జాల్నాలో స్వతంత్రుడిగా గెలిచాడు. అమీర్ ఖాన్ పోలింగ్ స్థానంలో మరాఠీలో ఓటు పిలుపు ఇచ్చి, ’హిందీనా? ఇది మహారాష్ట్ర భాయ్!’ అంటూ వైరల్ అయ్యాడు. పునరేకీకరణలు ఫలితాల్ని మార్చలేకపోయాయి.
మజ్లిస్ రాష్ట్రవ్యాప్త శక్తిగా, బీజేపీ మహాయుతి ఆధిపత్యంతో కాంగ్రెస్ బలహీనపడింది. మైనారిటీ ఓట్ల మార్పు, మహాయుతి గెలుపు రాబోయే ఎన్నికల్లో కొత్త డైనమిక్స్‌కు దారి తీస్తున్నాయి.