https://oktelugu.com/

ఏపీలో ఎంపీలు వర్సెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు

ఏపీలో బంపర్‌‌ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. 151 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది సత్తాచాటారు. అంతేకాదు.. 22 మంది ఎంపీలను గెలిపించుకున్నారు. ఇపుడు ఈ ఎంపీలంతా కూడా పార్టీ నేత‌ల అస‌మ్మతి జ్వాల‌ల్లో నలిగిపోతున్నారు. ఎవరో ఒక‌రో ఇద్దరు మిన‌హా మిగితా ఎంపీలందరూ సొంత పార్టీ మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలతో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ ఇంట‌ర్నల్ వార్‌లో త‌ప్పొప్పులు ఎవ‌రివి అన్నది ప‌క్కన పెడితే ఎంపీల‌కు మాత్రం సెగ‌లు త‌ప్పడం లేదు. విశాఖ ఎంపీ ఎంవీవీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 13, 2021 2:00 pm
    Follow us on

    MPs vs. Ministers
    ఏపీలో బంపర్‌‌ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. 151 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది సత్తాచాటారు. అంతేకాదు.. 22 మంది ఎంపీలను గెలిపించుకున్నారు. ఇపుడు ఈ ఎంపీలంతా కూడా పార్టీ నేత‌ల అస‌మ్మతి జ్వాల‌ల్లో నలిగిపోతున్నారు. ఎవరో ఒక‌రో ఇద్దరు మిన‌హా మిగితా ఎంపీలందరూ సొంత పార్టీ మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలతో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ ఇంట‌ర్నల్ వార్‌లో త‌ప్పొప్పులు ఎవ‌రివి అన్నది ప‌క్కన పెడితే ఎంపీల‌కు మాత్రం సెగ‌లు త‌ప్పడం లేదు. విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్యనారాయ‌ణ‌కు స్థానిక ఎమ్మెల్యేల‌కు ప‌డ‌డం లేదు. అన‌కాప‌ల్లి ఎంపీ స‌త్యవ‌తికి స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్నాథ్‌కు పొస‌గ‌డం లేదు.

    Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు వేల రూపాయాలు.. ప్రలోభాలు షురూ..

    ఇక.. గోదావ‌రి జిల్లాల్లో ఐదుగురు ఎంపీల‌కు సొంత పార్టీ నేత‌ల నుంచి మామూలు సెగ‌లేదు. కాకినాడ ఎంపీ వంగా గీత సైలెంట్‌గానే ఉన్నా ఆమె స్థానికంగా కొంద‌రు ఎమ్మెల్యేలు త‌న‌కు ప్రయార్టీ ఇవ్వడం లేద‌ని ర‌గులుతున్నారు. ఇక ఆమె పిఠాపురంపై క‌న్నేశార‌న్న వార్తల నేప‌థ్యంలో అక్కడ ఎమ్మెల్యే దొర‌బాబును ఆమెను టార్గెట్ చేయ‌డం స్టార్ట్ చేశారు. ఇక అమలాపురం ఎంపీ చింతా అనూరాధ‌కు మంత్రి విశ్వరూప్‌కు కూల్ వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది. ఆమెకు మ‌రో మంత్రి చెల్లుబోయిన వేణుతో పాటు రాజోలు పార్టీ నేత‌ల‌కు కూడా ప‌డ‌ట్లేదు.

    రాజ‌మ‌హేంద్రవ‌రం ఎంపీ మార్గాని భ‌ర‌త్‌కు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేల‌తో ప‌డట్లేదు. భ‌ర‌త్‌కు కాపు కార్పొరేష‌న్ చైర్మన్ రాజాకు మ‌ధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. ప‌శ్చిమ గోదావరిలో ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌కు చింత‌ల‌పూడి ఎమ్మెల్యే ఎలీజాకు పెద్ద యుద్ధమే న‌డుస్తోంది. స్థానిక ఎన్నిక‌ల్లోనూ ఒకే పార్టీ నుంచి వీరిద్దరి గ్రూపులు పోటీ చేశాయి. మంత్రి ఆళ్ల నానితోనూ శ్రీధర్‌కు గ్యాప్ ఉందంటున్నారు. ఇక న‌ర‌సాపురం ఎంపీ ఏకంగా పార్టీ అధిష్టానంపైనే యుద్ధం ప్రక‌టించి స్థానిక పార్టీ నేత‌ల‌కు దూర‌మైపోయారు.

    Also Read: ముగిసిన ప్రచారం.. మొదలైన పలుకరింపు

    బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌కు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి మ‌ధ్య ఓపెన్ వార్ న‌డుస్తుండ‌గా.. అదే జిల్లాలోని న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయులుకు చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే ర‌జ‌నీ, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుతో పెద్ద యుద్ధం న‌డుస్తోంది. ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఎవ్వరూ ప‌ట్టించుకోవ‌డం లేదు. మంత్రి బాలినేనికి ఆయ‌న‌కు ఏ మాత్రం స‌ఖ్యత లేదు. నెల్లూరు ఎంపీ ఆదాల‌కు కొంద‌రు ఎమ్మెల్యేల‌తో గ్యాప్ ఉన్నా ఆయ‌న సైలెంట్‌గా ఉన్నారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి మ‌ద‌న‌ప‌ల్లి ఎమ్మెల్యేకు ప‌డట్లేదు. ఇటీవల స్థానిక ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే వ‌ర్గానికి వ్యతిరేకంగా 15 పంచాయ‌తీల్లో ఎంపీ వ‌ర్గం పోటీ చేసింద‌ని గుర్రుగా ఉన్నారు. ఇదే మిథున్‌రెడ్డితో త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న మ‌రో కీల‌క ఎమ్మెల్యేతోనూ ప‌డ‌ట్లేదు. క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డికి మంత్రి అంజాద్‌కు ప‌డ‌క‌పోయినా మంత్రి కిమ్మన‌లేని ప‌రిస్థితి. ఉన్నంత‌లో క‌ర్నూలు ఎంపీలకు లోప‌ల ఎలా ఉన్నా పైకి సెగ‌లేవి బ‌య‌ట ప‌డ‌ట్లేదు. అనంత‌పురంలోనూ ఎంపీల‌కు సెగ‌లు త‌ప్పడం లేదు. అనంత ఎంపీ రంగ‌య్యకు ఎమ్మెల్యేలు గుర్నాథ‌రెడ్డి, ఉషా చ‌ర‌ణ్‌తో వార్ న‌డుస్తోంది. హిందూపురం ఎమ్మెల్యేకు పెనుగొండ‌, హిందూపురం ఎమ్మెల్యేల‌తో వార్ ఉంది. ఏదేమైనా వైసీపీ ఎంపీల్లో 90 శాతం మంది సొంత పార్టీ నేత‌ల నుంచే సెగ‌లు ఎదుర్కొంటున్నారు. వీరిలో కొంద‌రు త‌మ త‌ప్పులేక‌పోయినా ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్పడం లేదు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్