https://oktelugu.com/

మరో వివాదంలోకి ఎస్వీబీసీ..!

తిరుమల తిరుపతికి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానెల్ మరో వివాదానికి కేంద్ర బింధువుగా మారింది. గతంలో ఎస్విబీసీ ఛైర్మన్ గా ఉన్న పృధ్వీరాజ్ కు ఛానెల్ కు సంబంధించిన ఒక మహిళా ఉద్యోగితో సంబాషించిన ఆడియో టేపులు బయటకు రావడంతో ఆయన తన పదవిని కోల్పోయిన విషయం విధితమే. అయోధ్యలో దశాబ్ధాల తరబడి కొనసాగుతున్న వివాదానికి తెరపడి హిందువులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రామాలయ నిర్మాణానికి ప్రధాని మోడీ శంఖుస్థాపన చేశారు. Also […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 6, 2020 / 07:46 PM IST
    Follow us on


    తిరుమల తిరుపతికి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానెల్ మరో వివాదానికి కేంద్ర బింధువుగా మారింది. గతంలో ఎస్విబీసీ ఛైర్మన్ గా ఉన్న పృధ్వీరాజ్ కు ఛానెల్ కు సంబంధించిన ఒక మహిళా ఉద్యోగితో సంబాషించిన ఆడియో టేపులు బయటకు రావడంతో ఆయన తన పదవిని కోల్పోయిన విషయం విధితమే. అయోధ్యలో దశాబ్ధాల తరబడి కొనసాగుతున్న వివాదానికి తెరపడి హిందువులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రామాలయ నిర్మాణానికి ప్రధాని మోడీ శంఖుస్థాపన చేశారు.

    Also Read: 72 సంవత్సరాల తర్వాత భారత్ గా మారిన ఇండియా

    అయోధ్యలో రామాలయ నిర్మాణం హిందూదేశంలో ఎంతో కీలకమైన అంశమే. అన్ని మీడియా సంస్థలు శంఖుస్థాపన, రామాలయ విశేషాలు కవరేజ్ కు ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాయి.ప్రైవేట్ భక్తి ఛానెల్స్, న్యూస్ ఛానెల్స్ ఈ కార్యక్రమాన్ని లైవ్ ఇచ్చాయి. రామాలయ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై పత్యేక కథనాలను ప్రసారం చేశాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేసే శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) మాత్రం రామమందిర నిర్మాణం తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరించిందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.

    అయోధ్య రామాలయ శంఖుస్థాపన విషయమే ఎస్వీబీసీలో ప్రసారం చేయకపోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎస్వీబీసీ సిఇఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్ధేశపూర్వకంగానే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రసారం చేయకపోవడం సరైన చర్య కాదనేది అటు స్వామివారి భక్తులు చెబుతున్నారు.

    Also Read: మీ చావు మీరు చావండి.. ఏపీపై కేంద్రం నిర్ణయమిదే?

    కొద్ది రోజుల కిందట టిటిడి నిర్వహిస్తున్న సప్తగిరి మాసపత్రిక ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ పత్రికలో ప్రచురించిన వ్యాసం వివాదాస్పదంగా మారింది. ఒక విద్యార్ధి పంపిన కథను మాసపత్రికలో ప్రచురించారు. కథలో కుశుడు సీతారాముల కోడుకు కాదని, వాల్మీకి గడ్డితో చేసిన బోమ్మ అంటూ వివాదాస్పద అంశాలు ఉన్నాయి. బాలవాక్కు శీర్షిక పేరుతో ప్రచురితమైన ఈ కథపై హిందుత్వ సంస్థలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. దీంతో సప్తగిరి మాసపత్రిక చీఫ్ ఏడిటర్ రాధారమణి, సబ్ ఎడిటర్ ఉత్తర పల్గుణిలను సస్పెండ్ చేస్తూ టిటిడి బోర్డు నిర్ణయం తీసుకుంది. మరి తాజాగా ఎస్వీబీసీపై నెలకొన్న ఈ వివాదంలో ఎవరిపై వేటు పడుతుందోనని సిబ్బంది ఆందోళనతో ఉన్నారు.