ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరి పేట నుంచి నరసారావు పేట వరకు ఉన్న రహదారిని విస్తరించాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉంది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు పెరగడంతో అందుకు అనుగుణంగా రోడ్డును వెడల్పు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరిస్తే బాగుంటుందనే అభిప్రాయం ఉంది.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. NH 167A గా పిలుచుకునే చిలకలూరిపేట – నరసరావుపేట రహదారిని 4 లైన్లుగా విస్తరించే అవకాశం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. దీనికి రహదారులు, రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు.
చిలకలూరిపేట నుండి నరసరావుపేట వరకు గల రహదారిని విస్తరించే అంశాన్ని సంబంధిత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ప్రణాళికలో చేర్చినట్టు మంత్రి వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరపు వార్షిక రహదారుల ప్రణాళికలో ఈ రోడ్డును కూడా చేర్చినట్టు తెలిపారు. అయితే.. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఇంకా టెండర్ దశలో ఉన్నందువల్ల.. పూర్తిస్థాయి డీపీఆర్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలను తెలియజేస్తామని ప్రకటించారు.
ఈ రోడ్డు మార్గాన్ని విస్తరిస్తే.. రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. చాల కాలంగా రెండు లైన్ల రహదారిగానే ఉండడంతో రాకపోకలు అంత సాఫీగా సాగే పరిస్థితి లేకుండా పోయింది. అందువల్ల.. ఈ మార్గాన్ని నాలుగు లైన్ల దారిగా విస్తరించాలని చాలా కాలంగా ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై జీవీఎల్ ప్రశ్నించడంతో.. కేంద్రం పై విధంగా సమాధానం ఇచ్చింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Mp gvl narasimha rao questioned govt in rajya sabha about ap road winding
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com