Homeఆంధ్రప్రదేశ్‌విశాఖ రైల్వేజోన్ లేనట్లేనా?

విశాఖ రైల్వేజోన్ లేనట్లేనా?

Is there no Visakhapatnam Railway Zoneఈతాకు ఇచ్చి తాటాకు దొబ్బడం అంటే ఇదేనేమో. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మరోసారి మొండిచేయి చూపించింది. విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని కొద్ది కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వాల్తేర్ డివిజన్ ను ఒడిశాలోని రాయగడ్ డివిజన్ లో కలిపేసింది. విశాఖ రైల్వే జోన్ పనులు ప్రాథమికంగా ప్రారంభం కూడా కాలేదు. దీంతో విశాఖ రైల్వే డివిజన్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాల్తేరును లాగేసుకుని రాయగఢ్ లో కలుపుకునే పనులు మాత్రం పూర్తయ్యాయి. కానీ విశాఖ రైల్వే జోన్ కు మాత్రం పైసా కేటాయించలేదు

మూడేళ్ల కిందటే వివాఖను రైల్వే జోన్ గా కేంద్రం ప్రకటించింది. అత్యంత లాభదాయకమైన వాల్తేర్ డివిజన్ ను మాత్రం రెండు ముక్కలు చేసింది. ఒక ముక్కను విజయవాడ డివిజన్ లో కలిపారు. మరో ముక్కతో ఒడిశాలోని రాయగఢ్ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖ కేంద్రంగా ఈజోన్ ఉంటుంది. సరుకు రవాణాలో కీలకంగా ఉండే కోరాపుట్, కిరండోల్ లైన్లను రాయగఢ్ లోనే కలిపారు.

రాయగఢ్ డివిజన్ ఏర్పాటుకు సరైన వసతులు లేవు. అయినా కోట్లు ఖర్చు చేస్తూ పనులు నిర్వహిస్తోంది. రూ.40 కోట్ల విలువైన పనులు చేస్తున్నారు. డివిజన్ కేంద్ర కార్యాలయానికి భూకేటాయింపులు చేశారు. పనులు చకచకక సాగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాయగఢ్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని వసతులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు విశాఖలో భవనాలు సిద్ధంగా ఉన్నాయి. అయినా అధికారిక నిర్ణయం తీసుకోవడం లేదు. రాయగఢ్ డివిజన్ పనులు పూర్తయితే విశాఖ రైల్వే జోన్ సంగతి మరుస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version