
ఏపీలోని ఆలయాలపై జరుగుతున్న దాడులను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థం రామ గిరిపై ఉన్న రామస్వామివారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దోషులను వెంటనే శిక్షించాలి అని బీజేపీ తరుపున డిమాండ్ చేశారు. త్వరలోనే విగ్రహాల ధ్వంసంపై ఏపీలో ఉద్యమం చేస్తామని సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Also Read: ఏపీలో విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా దాడులు జరుగుతున్నాయని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని సోము వీర్రాజు దుయ్యాబట్టారు. కనీసం ఏపీ ప్రభుత్వం తరుఫున మంత్రులు కూడా సందర్శించడం లేదని విమర్శించారు.
విజయనగరం రామతీర్థం ఆలయ విగ్రహం ధ్వంసం జరిగినప్పుడు బీజేపీ శ్రేణులు ఆ కొండపైకి ఎక్కి నష్టనివారణ చర్యలు చేపట్టారని..ప్రభుత్వం తరుఫున ఎవరూ రాలేదని విమర్శించారు.
Also Read: వీహెచ్ ను దూషించిన రేవంత్ అభిమాని అరెస్టు..!
ఏపీలోని జగన్ ప్రభుత్వానికి చర్చి మీద రాయిస్తే ఉన్న శ్రద్ధ.. దేవాలయాలపై లేదని సోము వీర్రాజు మండిపడ్డారు. రామతీర్థలో విగ్రహాన్ని తునాతునకలు చేసిన ఇప్పటివరకు దాడి చేసిన వారిని ఈ ప్రభుత్వం గుర్తించలేదని.. అరెస్ట్ చేయలేదని సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ నిర్లక్ష్య ప్రభుత్వాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్