Mokshajna to compete with NTR: ప్రస్తుతం బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లుంది పరిస్థితి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ వర్గాలను తీవ్ర అసహనానికి గురి చేసిన ఈ అంశంపై నందమూరి హీరోలు ఫైర్ అయ్యారు. కళ్యాణ్ రామ్, బాలకృష్ణ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ మాత్రం కొంచెం సాఫ్ట్ గా, డిప్లొమాటిక్ గా స్పందించారు. పేరు మార్పును ఖండిస్తూనే వైఎస్సార్, ఎన్టీఆర్ సమాన స్థాయి నాయకులన్నట్లు అభిప్రాయపడ్డారు. ఎలాగైనా టీడీపీకి ఎన్టీఆర్ ని దూరం చేయాలని చూస్తున్న వారికి ఇదో అస్త్రంగా దొరికింది. ఎన్టీఆర్ ట్వీట్ ని తప్పుబడుతూ ఆయనపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
Also Read: TDP vs YCP: సెంట్రల్ జైలుకు జగన్ పేరు: వారెవ్వా, ఏమి సలహా !
టీడీపీలోని ఒక వర్గం పనిగట్టుకొని ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తుంది. ఆ పార్టీ మీడియా సంస్థలు అనేక కోణాల్లో ఎన్టీఆర్ ని ఏకిపారేస్తున్నాయి. చివరకు సీనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఎన్టీఆర్ పై ద్వేషం రగిలించే ప్రణాళికతో ముందుకు వెళుతున్నాయి. టీడీపీలో ఉన్న ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ దీన్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఎన్టీఆర్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక వ్యతిరేకులు ఎన్టీఆర్ తన స్టార్ డమ్ చూసుకొని విర్రవీగుతున్నాడని, ఆయనకు పోటీగా మరో నందమూరి వారసుడు రావాలంటున్నారు.
అందుకు బాలయ్య కొడుకు మోక్షజ్ఞనే సరైన వ్యక్తి అని ఎన్టీఆర్ యాంటీ వర్గం ఆలోచన. ఈ క్రమంలో బాలయ్యపై మరింత ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. మోక్షజ్ఞను బరిలో దింపండి ఆయన భవిష్యత్, కెరీర్ మేము చూసుకుంటాం అంటున్నారట. మోక్షజ్ఞను ఎన్టీఆర్ కి ధీటుగా పెద్ద స్టార్ ని చేస్తాం అంటున్నారట. మోక్షజ్ఞ స్టార్ కావడమే ఎన్టీఆర్ కి మనమిచ్చే అసలైన ఝలక్ అని భావిస్తున్నారట. టీడీపీ వర్గాల్లో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన మీటింగ్లు, చర్చలు కూడా మొదలయ్యాయట.
Also Read: Naga Babu: చేతికి గాయం… ముల్లును ముల్లుతోనే తీయాలంటూ నాగబాబు ఆసక్తికర పోస్ట్..!
నిజానికి ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబం వేరుగానే చూసింది. వస్తూనే సంచలనాలు చేసిన ఎన్టీఆర్ ని తొక్కేయడానికి నందమూరి కుటుంబంలోనే కుట్రలు జరిగాయన్న వాదన ఉంది. 2002లో నందమూరి తారక్ ఎంట్రీ ఈ కుట్రలో భాగమే అంటారు. ఎన్టీఆర్ వారసుడిగా స్టార్ డమ్ తెచ్చుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ని దెబ్బతీయడానికి తారక్ ని వదిలారట. ఇక బాలయ్య తర్వాత ఎన్టీఆర్ వారసుల్లో స్టార్ అయ్యింది ఒక్క జూనియర్ ఎన్టీఆరే. మోక్షజ్ఞని స్టార్ ని చేయడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన వర్గాన్ని ఇటు తిప్పుకొని దెబ్బతీయాలని చూస్తున్నారట. అది అంత సులభం కాదని తెలిసినా ప్రయత్నాలైతే మొదలయ్యాయట.