Bigg Boss 6 Neha Chowdary: హౌస్ లో ఆదివారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్ లో ఉన్న తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నుండి నేహా ఎలిమినేట్ కావడమైంది. అసలు గేమ్ పట్ల ఎలాంటి సీరియస్ నెస్ లేని కంటెస్టెంట్స్ హౌస్ లో ఉండగా నేహా చౌదరి ఎలిమినేట్ కావడం ఊహించని పరిణామం. మొదటి వారం నుండి నేహా హౌస్ లో పోరాట స్ఫూర్తి చూపిస్తుంది. ఫస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో కూడా ఆమె ఓ గేమ్ లో పోరాడి గెలిచారు. ఇనయాతో పోటీపడి మరి విజయాన్ని అందుకున్నారు.

ఈ వారం జరిగిన అడవిలో ఆట టాస్క్ లో నేహా చౌదరి వెనుకబడ్డారు. దానికి కారణం ఆమె కాలికి గాయమైంది . దీంతో పూర్తి స్థాయిలో ఆ టాస్క్ ఆడలేకపోయారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ కి నామినేటైన లిస్ట్ పరిశీలిస్తే… సింగర్ రేవంత్, నటుడు బాల ఆదిత్య, గీతూ రాయల్, ఆరోహి రావు, చలాకీ చంటి, వాసంతి, శ్రీహాన్, నేహా, ఇనయ సుల్తానా ఉన్నారు. సోషల్ మీడియా ఓటింగ్స్ లో కూడా నేహా చౌదరి వెనుకబడిన దాఖలాలు లేవు. ఈ లిస్ట్ పరిశీలించినా ఆమె కంటే వీక్ కంటెస్టెంట్స్ గా వాసంతి, ఇనయా, ఆరోహి రావులు ఉన్నారు.
పాపులారిటీ రీత్యా రేవంత్, బాల ఆదిత్య, గీతూ, చంటి ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. ఈ క్రమంలో వాసంతి లేదా ఇనయా సుల్తానా ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా నేహా ఎలిమినేట్ అయ్యారు. తొమ్మిది మంది కంటెస్టెంట్స్ లో చివరికి వాసంతి, నేహా మిగలగా… వాసంతిని నాగార్జున సేవ్ చేశాడు. మొదటి నుండి గేమ్ గమనిస్తున్న ప్రేక్షకులు ఈ ఎలిమినేషన్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేహా ఎలిమినేట్ కావాల్సింది కాదన్న అభిప్రాయంతో ఉన్నారు.

నేహా చౌదరి సైతం అసహనం వ్యక్తం చేశారు. నమ్మిన వాళ్లే నన్ను ముంచారు. వాళ్ళ కారణంగా ఎలిమినేటై వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉందని చెప్పింది. నేహా ఆరోపించిన ఆ వ్యక్తి సింగర్ రేవంత్ అంటున్నారు. సింగర్ రేవంత్ కారణంగానే తాను ఎలిమినేషన్ లోకి వచ్చాను. ఆ కారణంగా ఎలిమినేట్ అయ్యానని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తంగా నేహా ఎలిమినేషన్ వెనుక కుట్ర ఉందని ప్రేక్షకుల వాదన. నేహా ఎలిమినేట్ కావాల్సింది కాదంటున్నారు. ఇక చాలా కాలంగా బిగ్ బాస్ షో పై ఓ అపవాదు ఉంది. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా కాకుండా వాళ్ల ఇష్టప్రకారం ఎలిమినేట్ చేస్తారని పలు కథనాలు వెలువడ్డాయి. నేహా ఎలిమినేషన్ మరో సారి ఈ వాదనను తెరపైకి తెచ్చింది.