
Mohan Babu Comments: ‘మా’ ఎన్నికల్లో మళ్ళీ ముదిరిన గందరగోళం, సీనియర్ నటుడు నరేష్ పై విరుచుకుపడుతున్న ప్రకాష్ రాజ్ బృందం, ఈ క్రమంలో నరేష్ కి ప్రకాష్ రాజ్ కి మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. దాంతో ఎన్నికల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గొడవలు, తోపులాటల మధ్య ఇద్దరు ఆవేశపడ్డారు. పక్కనే ఉన్న మోహన్ బాబు సైలెంట్ గా చూస్తూ ఉన్నారు. కానీ మధ్యలో నటుడు బెనర్జీ, ప్రకాష్ రాజ్ కి మద్దతుగా వెళ్ళాడు.
దాంతో మోహన్ బాబులో కోపం కట్టలు తెచ్చుకుంది. వృద్ధ సింహంలా గర్జించారు. బెనర్జీ పై విరుచుకు పడ్డారు. ఎక్కువ చేస్తే చీరేస్తా అంటూ మోహన్ బాబు తనదైన శైలిలో రెచ్చిపోయారు. మధ్యలో ఆపడానికి ఓ నటుడు ప్రయత్నం చేస్తే.. ఆ నటుడి పై కూడా మోహన్ బాబు సీరియస్ అయ్యాడట. అయితే, మోహన్ బాబు రియాక్షన్ పై బెనర్జీ కూడా సీరియస్ లుక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అది గమనించిన శ్రీకాంత్, బెనర్జీని పక్కకి లాక్కెళ్లి క్లాస్ పీకాడట. మొత్తానికి పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టి, ఎన్నికలను సాఫీగా సాగేలా ఎన్ని ప్రయత్నాలు చేసినా నటుల మధ్య రగులుతున్న కోపాగ్నిని చలార్చడం ఎవ్వరి వల్ల కావడం లేదు. అయినా ఎన్నిక్లలో ఒక్కసారిగా గొడవ జరుగుతుంటే.. ఎన్నికల అధికారులు, సినీ పెద్దలు ఏమి చేస్తున్నారు ?
నిజానికి మొదటి నుంచి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా మాజీ ప్రెసిడెంట్ గా నరేష్ కి, మిగిలిన వారికీ మాటల యుద్ధం, ఆరోణల సునామీ జరుగుతుంది. అయితే, నరేష్, మంచు ఫ్యామిలీకి దగ్గర అవ్వడంతో, నరేష్ పై విమర్శలకు మంచు ఫ్యామిలీ రియాక్ట్ అవ్వాల్సి వస్తోంది.
కానీ, ఎన్నికల జరుగుతున్న క్రమంలో మోహన్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోపంతో ఊగిపోవడం ఆయన పెద్దరికానికే మంచిది కాదు, అయినా తోటి నటులను మోహన్ బాబు ఎలా బెదిరిస్తారు ? బెనర్జీని చంపేస్తామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారని కూడా తెలుస్తోంది. మోహన్ బాబు వ్యాఖ్యల పై కచ్చితంగా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఉంది.